స్టాక్ మార్కెట్లు: నిన్న అంతంత మాత్రం.. నేడు నష్టాల్లో ప్రారంభం

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై : వారం ముగింపు అయిన శుక్రవారం రోజున స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 69.30 పాయింట్ల నష్టంలో 33,181 వద్ద, నిఫ్టీ 28.30 పాయింట్ల నష్టంలో 10,280 వద్ద కొనసాగుతున్నాయి.

జీఎస్టీ మీటింగ్‌, ఎస్‌బీఐ ఫలితాలపైన ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు. ప్రారంభ ట్రేడింగ్‌లో అరబిందో ఫార్మా, జిందాల్‌ స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌ లాభపడగా.. టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, హీరో మోటార్‌కార్ప్ నష్టాలు పాలయ్యాయి.

 Market Live - Sensex, Nifty trade lower, L&T shares rise 3%

నిన్న గురువారం నాటి ట్రేడింగ్ లో కూడా రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడికక్కడే ముగిశాయి. పన్ను రేట్లు తగ్గించడం ద్వారా పలు రంగాలకు ఊరటనిచ్చేలా జీఎస్‌టీ మండలి నిర్ణయాలు తీసుకోచ్చన్న అంచనాలతో స్టాక్‌ సూచీల మధ్యాహ్నం నష్టాలు చాలావరకూ రికవరీ అయ్యాయి.

దీంతో రెండు రోజుల నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 512 పాయింట్లు వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ గురువారం 32 పాయింట్ల లాభంతో 33,251 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,309 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,368-10,267 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది.

నిజానికి గురువారం నాడు స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే ఆసియా మార్కెట్లలో ట్రెండ్‌ రివర్స్‌ కావడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 245 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 107 పాయింట్లు నష్టపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BSE Sensex opened over 90 points lower on Friday against the previous session’s closing. The NSE Nifty also fell over 25 points in the early trade. The Indian rupee traded lower and headed for its biggest weekly drop in seven weeks. The shares of L&T, ONGC and SBI rose, whereas shares of Tata Motors, Reliance and Asian Paints fell. The government will issue consumer price and wholesale price based inflation data for October on 13 November and 14 November respectively. According to Bloomberg analyst estimates, Consumer Price Index expected to be at 3.4% from 3.28% a month ago while Wholesale Price Index will be at 3.01% versus 2.6% a month ago. The government will also issue Index of Industrial Production data for September on 10 November and Bloomberg analysts expect that it will be at 3.8% from 4.3% a month ago.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి