Marriage: పెళైన నాలుగు రోజులకే, అత్తారింటికి బయలుదేరిన పెళ్లి కూతురు, మృత్యువు మింగేసింది !
చెన్నై/ తిరువత్తూరు: యువకుడు మెడిసిన్స్ హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. యువతి డాక్టర్ గా పని చేస్తున్నది. ఇద్దరికి వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లు అందరూ పెళ్లికి హాజరైనారు. వందేళ్లు పిల్లాపాపలతో సుఖంగా జీవించాలని పెళ్లికి వచ్చిన వారు ఆశీర్వదించారు. వివాహం జరిగిన నాలుగు రోజులకు నవ దంపతులు అబ్బాయి ఇంటికి బయలుదేరారు. సాంప్రధాయం ప్రకారం వివాహం జరిగిన ఐదవ రోజు పూజ చెయ్యాలని సంతోషంగా కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు ఒక రోజు ముందుగానే బయలుదేరి కారులో సరదాగా కబుర్లు చెప్పకుండా వెలుతున్నారు. మృత్యువురూపంలో వచ్చిన సిమెంట్ లారీ నవదంపతులు వెలుతున్న కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు, కొత్త పెళ్లి కూతురు కారులో చిక్కుకుని దుర్మరణం చెందారు. వివాహం జరిగిన నాలుగు రోజులకే ఇద్దరూ దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు షాక్ అయ్యారు.

అమ్మాయి డాక్టర్
తమిళనాడులోని అరక్కోణంలో మనోజ్ కుమార్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మనోజ్ కుమార్ మెడిసిన్స్ (మందులు) హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. తమిళనాడులోని తాంబరంలోని పెరుంగళత్తూరులో కార్తీక (30) అనే యువతి నివాసం ఉంటున్నది. కార్తీక ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నది,

నాలుగు రోజుల ముందు గ్రాండ్ గా పెళ్లి
కార్తీక, మనోజ్ కుమార్ కు పెళ్లి సంబంధం చూసిన పెద్దలు మనోజ్ కుమార్, కార్తీకల వివాహం చెయ్యాలని మాట్లాడుకున్నారు. గత నెల 28వ తేదీ ( నాలుగు రోజుల క్రితం)అరక్కోణంగా గ్రాండ్ గా మనోజ్ కుమార్, కార్తీకల పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు కార్తీక, పెళ్లి కొడుకు మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లు అందరూ పెళ్లికి హాజరైనారు.

వందేళ్లు సంతోషంగా ఉండండి
మనోజ్ కుమార్, కార్తీక దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ మురిసిపోయారు. వందేళ్లు పిల్లాపాపలతో సుఖంగా జీవించాలని పెళ్లికి వచ్చిన వారు మనోజ్ కుమార్, కార్తీక దంపతులను ఆశీర్వదించారు. వివాహం జరిగిన తరువాత పెళ్లి కూతురు కార్తీక ఇంటికి మనోజ్ కుమార్ వెళ్లాడు. మూడు రాత్రులు కార్తీక, మనోజ్ కుమార్ దంపతులు సంతోషంగా గడిపారు.

కారులో బయలుదేరిన నవదంపతులు
వివాహం జరిగిన నాలుగు రోజులకు కార్తీక పెళ్లి కొడుకు మనోజ్ కుమార్ ఇంటికి బయలుదేరారు. సాంప్రధాయం ప్రకారం వివాహం జరిగిన ఐదవ రోజు మనోజ్ కుమార్ ఇంట్లో పూజ చెయ్యాలని సంతోషంగా కొత్త పెళ్లి కూతురు కార్తీక ఒక రోజు ముందుగానే సోమవారం బయలుదేరి కారులో సరదాగా కబుర్లు చెప్పకుండా వెలుతున్నారు.

మృత్యువురూపంలో వచ్చిన సిమెంట్ లారీ
నవదంపతులు కార్తీక, మనోజ్ కుమార్ పూనమల్లి- అరక్కోణం హైవే రోడ్డులోని కదరత్తూరు సమీపంలో వెలుతున్న సమయంలో మృత్యువురూపంలో వచ్చిన సిమెంట్ లారీ నవదంపతులు వెలుతున్న కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో కొత్త పెళ్లి కొడుకు మనోజ్ కుమార్, కొత్త పెళ్లి కూతురు కార్తీక కారులో చిక్కుకుని దుర్మరణం చెందారు.

పెళైన నాలుగు రోజులకే పైలోకాలకు
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, కార్తీక దంపతులు శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరి మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహం జరిగిన నాలుగు రోజులకే నవదంపతులు మనోజ్ కుమార్, కార్తీక ఇద్దరూ దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications