Marriage: రిసెప్షన్ లో కుప్పకూలి ప్రాణాలు వదిలేసిన పెళ్లికూతురు, రిపోర్టులు అన్నీ వస్తే !
తిరువనంతపురం/కేరళ: యువతి, యువకుడి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు అందరూ పెళ్లికి హాజరైనారు. ముహూర్తం ముందు రోజు రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. రిసెప్షన్ లో బంధువులతో కలిసి ఫోటోలు తీసుకుంటున్న పెళ్లికూతురు కుప్పకూలి చనిపోయింది. పెళ్లికూతురు గుండెపోటుతో చనిపోయిందని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని, ఫోరెన్సిక్ పూర్తి రిపోర్టు రావాలని వైద్యులు అంటున్నారు.

అమ్మాయి పెళ్లి ఫిక్స్
కేరళలోని మలప్పురం జిల్లాలోని పధైక్కరకు చెందిన ముస్తఫా మరియు సీనాథ్ దంపతుల కుమార్తె ఫాతిమా బాదుల్ అలియాస్ ఫాతిమా (19). కేరళలోని మూర్కనాడుకు చెందిన యువకుడితో ఫాతిమా వివాహం జరిపించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఫాతిమా కుటుంబ సభ్యులు వారి బంధువులకు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అతని బంధువులు, స్నేహితులకు పెళ్లికి హాజరుకావాలని మనవి చేశారు.

బంధువులతో పెళ్లికూతురు ఫోటో షూట్
పెళ్లికి ముందురోజే వివాహ వేడుకలు, రిసెప్షన్ ను వధువు ఇంట్లో ఇస్లామిక్ మత పద్ధతి ప్రకారం నిర్వహించారు. వధువు ఫాతిమా తన కుటుంబంతో కలిసి ఫోటోలు తీసుకుంటున్నది. కొత్త డ్రెస్‌లో వేసుకున్న ఫాతిమా కొత్త జీవితంలోకి అడుగుపెడుతుందుకు చాలా ఆనందంగా ఉంది. అందరితో కలిసి ఫాతిమా ఉత్సాహంగా ఫోటోలు తీసుకుని సందడి చేస్తోంది.

ఆసుపత్రిలో ప్రాణం పోయింది
ఆ సందర్బంలో ఫాతిమా హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే పెళ్లికూతురు ఫాతిమాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫాతిమాకు చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఫాతిమా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొంతసేపటి తరువాత ఫాతిమా చనిపోయింది. ఫాతిమాకు ఛాతీలో నొప్పి రావడంతో చనిపోయిందని వైద్యులు అన్నారు.

అన్ని రిపోర్టులు రావాలి
అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మలప్పురంలోని మంజేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టంలో పరీక్షల్లో ఛాతీ నొప్పి కారణమని కచ్చితంగా చెప్పలేమని, పూర్తి పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే ఫాతిమా మరణానికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెప్పారని పోలీసులు అంటున్నారు. రిసెప్షన్ రోజు పెళ్లికూతురు ఫాతిమా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆమె కుటంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications