లేచిపోదామంటే రానంటావా?: ప్రియుడ్ని చెప్పుతో కొట్టిన వివాహిత

Subscribe to Oneindia Telugu

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ప్రాంతంలో వింత ఘటన చోటు చేసుకుంది. తనతో లేచిపోయేందుకు నిరాకరించిన తన ప్రియుడ్ని ఓ వివాహిత చెప్పులతో చితకబాదింది. కాగా, ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.

గజ్నేర్ ప్రాంతంలోని పాట్రా గ్రామంలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాన్పూర్ రూరల్ ఎస్పీ పుష్పాంజలి తెలిపిన వివరాల ప్రకారం.. బల్జీత్(30), సదరు వివాహిత మహిళ లేచిపోవాలిన ముందు నిర్ణయించుకున్నారని, అయితే అతడు ఆ తర్వాత నిరాకరించడంతో చితకబాదింది. అంతేగాక, కాలికున్న చెప్పును తీసి తీవ్రంగా కొట్టింది.

Married woman beats lover for ‘refusing’ to elope

ముగ్గురు పిల్లల తల్లి అయిన సదరు మహిళ.. బల్జీత్ తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉందని తెలిపారు. అయితే, ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియదు. ఈ నేపథ్యంలో తన ప్రియుడితో లేచిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. మొదట అంగీకరించిన ప్రియుడు.. తర్వాత నిరాకరించడంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

సదరు మహిళను, బల్జీత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి.. గత కొంతకాలంగా శరీరక సంబంధం కొనసాగిస్తున్నాడని సదరు మహిళ బల్జీత్ గురించి తెలిపింది. ఈ క్రమంలోనే లేచిపోవాలని నిర్ణయించుకున్నామని, చివరి నిమిషంలో అడ్డుచెప్పడంతో దాడి చేసినట్లు మహిళ పోలీసులకు వివరించింది.

అయితే, తాను సదరు మహిళతో లేచిపోవాలని ఎప్పుడూ నిర్ణయించుకోలేదని పోలీసులకు తెలిపాడు బల్జీత్. ఇప్పటి వరకు సదరు మహిళ.. బల్జీత్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఫిర్యాదు చేస్తే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Enraged with her lover’s refusal to elope with her, a mother of three beat him up with slippers as cops looked on at a police station in Kanpur.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి