పాక్ జెండా ఎగరేసిన వేర్పాటువాది మసరత్ ఆలం అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద నేత మసరత్ ఆలమ్‌ను శుక్రవారం శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు యువకులను భద్రతా బలగాలు కాల్చి చంపాయంటూ వేర్పాటు వాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మస్రత్ దక్షిణ కశ్మీర్‌లో ర్యాలీకి పిలుపునిచ్చారు.
ర్యాలీకి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా మసరత్‌ను అరెస్టు చేసింది. గిలానీ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. గత ర్యాలీలో వీరు పాకిస్థాన్‌కు అనుకూలంగా జెండాలు, నినాదాలతో ర్యాలీ చేశారు. కాగా, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించబోమని కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాక్ జెండాను ప్రదర్శించడమేగాక దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకుగాను మసరత్ ఆలం, జిలానీతోపాటు పలువురిపై పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.
కాగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పాక్ జెండాను ప్రదర్శించిన వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఫ్తీ ప్రభుత్వాన్ని సూచించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications