దేవతనని బాలిక దారుణం: మొన్న స్కూల్లోనూ వింతఏడ్పులు; దేశంలో మాస్ హిస్టీరియా!!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించిన నేటి రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలతో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట దేవతల పేరుతో సాగుతున్న మారణకాండలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ స్కూల్ లో పిల్లలు వింత అరుపులు, కేకలు, ఏడ్పులతో హంగామా సృష్టించిన ఘటన మరచిపోకముందే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని డూంగర్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తానే అమ్మవారినని చెప్పి ఒక బాలిక కత్తితో వీరంగం వేసింది. దేవత తనకు ఆవహించింది అని రాత్రంతా వీరంగం సృష్టించిన ఓ 15 ఏళ్ల బాలిక, అత్యంత కర్కశంగా సొంత చెల్లెలినే హతమార్చిన ఘటన చోటు చేసుకుంది.

చెల్లిపై ఏడు సార్లు కత్తితో దాడి చేసిన బాలిక .. మొండెం నుండి వేరైన మొండెం
దేవత తనకు ఆవహించిందని, తానే అమ్మవారిని అని ఓ పదిహేనేళ్ల బాలిక రక్తంతో హోలీ ఆడింది. చేతిలో కత్తితో, ఎవరు ఆపడానికి ప్రయత్నించినా, వారిపై దాడికి దిగింది. గదిలో నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల చెల్లె ఏడుసార్లు కత్తితో దాడి చేసి ఆమె ప్రాణాలను తీసింది. కత్తితో దారుణంగా దాడి చేయడంతో బాలిక మెడ తెగిపోయి మొండెం నుంచి విడిపోయింది. ఆపై బాలిక తండ్రి పై మామ పై కూడా కత్తితో దాడికి పాల్పడింది. ఈ ఘటన మొత్తం డుంగార్‌పూర్ జిల్లా చిత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

తానే దేవతనని ఓ పదిహేనేళ్ల బాలిక చేతిలో కత్తి పట్టుకుని
దుంగార్‌పూర్ జిల్లాలోని చిత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝింఝ్వా గ్రామంలో దశ మాత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అక్కడ చాలాసేపు పూజలు జరిగేవి. ఆదివారం కూడా అదే కొనసాగింది. గ్రామంలో పూజలు జరుగుతున్న ఇంట్లోనే ఉంటున్న శంకర్‌కుమార్‌కు చెందిన పదిహేనేళ్ల కూతురు కూడా అక్కడే ఉంది. అక్కడ కత్తిని కూడా ఉంచారు. ఒక్కసారిగా కూతురు లేచి నిల్చుని ఏడవడం మొదలుపెట్టింది. అరవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత కత్తిని చేతిలోకి తీసుకుంది. కత్తి ఎత్తుకుని డ్యాన్స్ చేయడం, కేకలు వేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడ ఎక్కువ మంది గుమిగూడారు.

తండ్రి, మామ అడ్డుకునేందుకు ప్రయత్నించగా..వారిపై కూడా కత్తితో దాడి
రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కత్తితో ఇంటి బయటికి వెళ్లడం ప్రారంభించిన ఆమె తిరిగి వచ్చి కేకలు వేయడం ప్రారంభించింది. అనంతరం ఓ గదిలో నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల సోదరిని హతమార్చింది . తండ్రి, మామ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా కత్తితో దాడి చేసింది. ఈరోజు అందరినీ చంపేస్తాను, ఎవరినీ వదలను అని అరవడం మొదలుపెట్టింది. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా భయపడిన జనంతో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ ఘటనపై అర్థరాత్రి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

మాస్ హిస్టీరియా అంటున్న వైద్య నిపుణులు
అయితే బాలిక మాస్ హిస్టీరియాతో బాధ పడుతుందని మానసిక నిపుణులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకోవటానికి కారణం వారి కుటుంబ పరిస్థితులు, నేపధ్యం అని అంటున్నారు వైద్యులు. తల్లి దండ్రులు మూఢ నమ్మకాలను విశ్వసిస్తే అవి కుటుంబంలోని చిన్నారులపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత కాకుండా ఉండాలంటే కచ్చితంగా తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న మాస్ హిస్టీరియా దారుణాలకు కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications