ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం; ఏడుగురు సజీవదహనం; ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో దాదాపు 60 గుడిసెలు అగ్నికి ఆహుతి కాగా, ఏడుగురు అగ్ని కీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే నష్టం జరిగిపోయింది.

ఢిల్లీ గోకుల్ పురి ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన, ఏడుగురు సజీవ దహనం

ఢిల్లీ గోకుల్ పురి ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన, ఏడుగురు సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో గోకుల్ పురి ప్రాంతంలో శుక్రవారం అర్దరాత్రి అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేసి ఘటనపై సమాచారం అందింది. 13 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఏడుగురు గుర్తించలేని విధంగా సజీవ దహనం అయ్యారు.

అగ్ని ప్రమాద సమయంలో వారు గాఢ నిద్రలో ఉన్నారు: ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్

ప్రమాద ఘటనపై ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, గుర్తించలేని స్థితిలో 7 కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ వ్యక్తులు నిద్రిస్తున్నట్లు ఉందని, మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో తప్పించుకోలేకపోయారని వెల్లడించారు. 60 గుడిసెలు కూడా పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాకు ఇంకా తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాం: నార్త్ ఈస్ట్ ఢిల్లీ అడిషనల్ డిసిపి

అగ్నిప్రమాద ఘటనపై నార్త్ ఈస్ట్ ఢిల్లీ అడిషనల్ డిసిపి మాట్లాడుతూ గోకుల్‌పురి పీఎస్ పరిధిలో అర్ధరాత్రి 1 గంటకు అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే బృందాలు అన్ని రెస్క్యూ పరికరాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తామగ్ని మాపక సిబ్బందిని కూడా అరెస్టు చేశామని, అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించిందని పేర్కొన్నారు. మూడు గంటల పోరాటం తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు మంటలను ఆర్పగలిగామని వెల్లడించారు. ఈ ఘటనలో 60 గుడిసెలు కాలిపోయాయని, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం

మరోవైపు ఈ అగ్నిప్రమాద ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఏడుగురు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిద్రలేచిన వెంటనే ప్రమాదానికి సంబంధించిన విషాదకర వార్త ని విన్నానని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలానికి తాను వెళుతున్నానని, బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అగ్నిప్రమాద ఘటనపై ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ఏడుగురి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అనుమానాలున్నాయని ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి కుటుంబ సభ్యులకు తక్షణమే కోటి రూపాయల సాయం ప్రకటించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+