ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం .. మంటలార్పుతున్న 34 ఫైరింజన్లు

న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో వ్యాపించిన మంటలు రెండో అంతస్తుకి చేరాయి. ప్రమాదం గురించి తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఎగిసిపడతున్న మంటలను 34 ఫైరింజన్లు ఆర్పివేస్తున్నాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం తెలియరాలేదు. దీంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీ బ్లాకును మూసివేశారు. ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించి ఓ వీడియోను వైద్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

Massive fire breaks out at AIIMS Delhi, 22 fire tenders on spot

అగ్నిరమాదానికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది మీడియాకు తెలిపారు. వెంటనే ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఎయిమ్స్‌లోనే మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కార్డియో న్యూరో సెంటర్ ఐసీయూలో జైట్లీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+