ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు, 17 మంది మృతి
హైదరాబాద్: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, లక్నో, కోల్‌కతా తదితర ఉత్తర భారత ప్రాంతాల్లో శనివారంనాడు భారీగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రతకు భారతదేశంలో 11 మంది మరణించారు. బీహార్‌లో 9 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు, పశ్చిమ బెంగాల్‌లో ఒకరు మరణించినట్లు సమాచారం. భూకంపం వల్ల భారత్‌లో నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం లేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు.
భూప్రకంపనల తర్వాత వారణాసిలోని భవనాలను ఖాళీ చేయించారు. ప్రధాని మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడారు.
రాంచీ, జైపూర్, గౌహతి, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం ఎపిసెంటర్ నేపాల్‌లో కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. రెక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 7.4గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లా గొల్లపూడి, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట గ్రామీణ ప్రాంతం, ఉర్లాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.
రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో శనివారం సంభవించిన భూప్రకంపనల తీరుపై సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు గుండ్లకమ్మప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడిన అనంతరం భూకంపంపై అధికారులతో సమీక్షించారు.
నేపాల్‌లో భారీ నష్టం
భూకంపంతో నేపాల్‌లో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. నేపాల్‌లో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రాణ నష్టం సంభవించిన సూచనలు మాత్రం కనిపించడం లేదు. నేపాల్‌లో మొబైల్ ఫోన్లపై తీవ్ర ప్రభావం పడింది.
భూప్రకంచనల తర్వాత ఢిల్లీ మెట్రో రైళ్లను కాసేపు నిలిపేశారు. ఉత్తర భారతదేశంలోని హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.
శనివారం ఉదయం 11.44 గంటల సమయంలో నిమిషం 8 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. పలు రైళ్లను ఉత్తరభారత దేశంలో ఆపేసినట్లు సమాచారం. సిలిగురి నుంచి బయలుదేరిన ఓ రైలు భూకంపం వల్ల డార్జిలింగ్ వద్ద ఆపేసినట్లు ఓ ప్రాయణికుడు సమాచారం అందించాడు. కోల్‌లో ఇళ్లు బీటలు వారినట్లు తెలుస్తోంది.
నేపాల్‌లోని భరత్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంల భూమిలోని 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేపాల్‌లో రవాణా వ్యవస్థకు విఘాతం కలిగినట్లు సమాచారం. రహదారులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
We are in the process of finding more information and are working to reach out to those affected, both at home & in Nepal.
— Narendra Modi (@narendramodi) April 25, 2015 ట్విట్టర్‌లో స్పందించిన మోడీ
భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. భూకంప తీవ్రతపై ఆయన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర, ఈశాన్య భారత్‌లో భూకంపం ప్రభావం ఉదని ఆయన చెప్పారు.
Massive 7.4 magnitude earthquake in Nepal, tremors felt across northern India http://t.co/PwDsJOoo2s pic.twitter.com/mntyAgYYgl
— NDTV (@ndtv) April 25, 2015 Earthquake @ Nepal pic.twitter.com/HIHDRKoUY9
— MAHESH SHAH (@MAHESHSHAH10) April 25, 2015 











Click it and Unblock the Notifications