• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్డీటీవీ విశ్లేషణ : యూపీ కోటాలో బీజేపీకి బీటలు, దెబ్బకొడుతోన్న ఎస్పీ, బీఎస్పీ కూటమి

|

న్యూఢిల్లీ : యూపీ కోటాలో అధికార బీజేపీ పీఠం బీటలువారిపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టిన బీజేపీ .. ఈసారి 37 సీట్లకే పరిమితమవుతోంది. ప్రధాని మోదీ మేనియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిష్మా ప్రజల్లో ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ మేరకు ఎన్డీటీవీ సర్వే పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

మోడీ కోటలో ప్రియాంకా గాంధీ: కాశీ విశ్వనాథునికి రుద్రాభిషేకం: మెడలో రుద్రాక్షమాల

71 నుంచి 37 సీట్లకు

71 నుంచి 37 సీట్లకు

గత ఎన్నికల్లో యూపీలో 71 స్థానాల్లో బీజేపీ, రెండు చోట్ల భాగస్వామ్య పక్షం ఆప్నాదళ్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొంది ... అధికారం చేపట్టింది. కానీ తర్వాత జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే యూపీలో మెజార్టీ సీట్లు తప్పనిసరి. 2014లో కమలం వికసించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే బీజేపీకి అంతా ఆశాజనకంగా లేదు. ఈ క్రమంలో ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు.

దెబ్బకొడుతోన్న ఎస్పీ-బీఎస్పీ కూటమి

దెబ్బకొడుతోన్న ఎస్పీ-బీఎస్పీ కూటమి

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎస్పీ, బీఎస్పీ కూటమి దెబ్బతీస్తోందని ఆయన అంచనా వేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సీట్లు 73 నుంచి 37కు పడిపోతాయని విశ్లేషించారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగితే బీజేపీకి మరింత నష్టం జరగుతోందని పేర్కొన్నారు. అప్పుడు వారి సీట్లు 37 నుంచి 23 సీట్లకు పడిపోతాయని లెక్కగట్టారు.

వారికే యాంటీ బీజేపీ ఓట్లు ?

వారికే యాంటీ బీజేపీ ఓట్లు ?

ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడమే బీజేపీ నష్టపోవడానికి ప్రధాన కారణమని రాయ్ విశ్లేషించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ .. ఎస్పీ, బీఎస్పీతో కలిసి 80 స్థానాల్లో కలిసి పోటీ చేస్తే యాంటీ బీజేపీ ఓట్లు వారికి పడతాయని పేర్కొన్నారు. అయితే నిన్న మాయావతి కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడిన సంగతిని గుర్తుచేశారు. యూపీలో కాంగ్రెస్ 7 సీట్లలో పోటీచేయమని ప్రకటించడంతో ... అవే ఎందుకు మొత్తం సీట్లలో పోటీచేయాలని స్పష్టంచేసింది. దీంతో కొంత అస్పష్త నెలకొంది .. దీనిపై ఎస్పీ కూడా మాయావతి స్వరాన్ని వినిపించింది.

అక్కడ అలా .. ఇక్కడ ఇలా ?

అక్కడ అలా .. ఇక్కడ ఇలా ?

పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీకి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపి .. సీట్ల విషయంలో రాజీపడుతోన్న కాంగ్రెస్ పార్టీ యూపీ విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తోందని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే కూటమి ఏర్పడి .. ప్రచార పర్వంలో మునిగిపోతుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యల వల్ల నష్టం వాటిల్లుతోందని అభిప్రాయపడ్డారాయన. దీనికంతటికి కారణం ఒక సెక్షన్ కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపించారు.

English summary
The opposition alliance in Uttar Pradesh -- the 80-seat state that's considered the gateway to Delhi -- could have a huge impact on the ruling BJP, data from past elections show. The BJP had swept the state in the 2014 national elections, winning 71 seats. Its ally Apna Dal had added two more seats to the tally. Data analysis by NDTV's Prannoy Roy shows that the Mayawati-Akhilesh Yadav combo alone could bring down the NDA score in the state from 73 to 37, even if Prime Minister Narendra Modi's popularity is at the level of the 2014 national election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more