ఇటు బాబ్రీ, అటు శ్రీకృష్ణ జన్మభూమి - పిటిషన్ కొట్టేసిన మధుర కోర్టు - హైకోర్టులో ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో 28 ఏళ్ల కిందట చోటుచేసుకున్న బాబ్రీ మసీదు విధ్వంసంపై లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు చెప్పిన కొద్ది గంటలకే.. అదే యూపీలోని మధుర పట్టణంలో శ్రీకృష్ణ జన్మస్థలంపై దాఖలైన వ్యాజ్యంపై స్థానిక సివిల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మధురలో కృష్ణుడి జన్మస్థలంగా భావిస్తోన్న చోట మసీదును తొలగించి, మొత్తం భూమి ఆలయానికే చెందేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
మధురలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల ప్రాంగణంలోనే శ్రీ కృష్ణుడి జన్మస్థలం ఉందని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669-70లో హిందువులకు చెందిన స్థంలో మసీదును నిర్మించారని, సదరు మసీదును వెంటనే తొలగించేలా ఆదేశాలివ్వాలని, అదే సమయంలో ఈ వివాదంపై శ్రీకృష్ణ జన్మస్ధాన్ సేవా సంఘ్, షాహి ఈద్గా ట్రస్ట్ మధ్య రాజీ కుదుర్చుతూ 1698లో కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలనీ పిటిషన్ లో కోరారు. ఇక్కడి భూమి ప్రతి అంగుళం శ్రీ కృష్ణుడు, హిందూ సమాజ భక్తులకు పవిత్రమైనదంటూ పిటిషన్ల తరఫున ప్రముఖ లాయర్ విష్ణు జైన్ వాదనలు వినిపించారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించడం ద్వారా సంచలనం రేపిన జడ్జి ఛాయా శర్మ.. తీర్పులోనూ అదే తీరును ప్రదర్శించారు. జైన్ వాదనలు ముగిసిన వెంటనే మరో అవకాశానికి తావు లేకుండా, సదరు పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆరాధన స్థలాలు (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991,ప్రకారం దేశంలో ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలైనా 1947 నాటి యథాతథ స్థితిని మార్చడానికి వీల్లేదని, ఆ చట్టాన్ని ఉల్లంఘించాలని చెబుతున్నందుకే పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు జడ్జి శర్మ వ్యాఖ్యానించారు. కాగా,

శ్రీకృష్ణ జన్మస్థలం అంశంపై దాఖలైన పిటిషన్ ను మధుర సివిల్ కోర్టు తిరస్కరించడంపై పిటిషన్ల తరఫు లాయర్ విష్ణు జైన్ మీడియాతో మాట్లాడారు. మధుర కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాము అలహాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తామని, కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని మొత్తం భూమి సాధించే వరకూ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications