విగ్రహాలు పెట్టినందుకు డబ్బు డిపాజిట్ చేయాల్సిందే: మాయావతికి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ: ప్రజాధనం ఉపయోగించి తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నందుకు గాను బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి డబ్బులు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేసాలు జారీ చేసింది. ప్రజాధనం ఖర్చు పెట్టడంపై ఆమెకు భారత అత్యున్నత న్యాయస్థానంలోనే గట్టి షాక్ తగిలింది.
మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని యూపీకి చెందిన ఓ లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజాధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు, తన విగ్రహాలను ఆవిష్కరించారని, కాబట్టి రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్ము జమ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇది తాత్కాలిక అభిప్రాయమని, దీనిపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుందని దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications