అంతా మాయా, ఏ లెక్కన గెలిచింది, దమ్ముందా: మోడీపై మాయావతి సంచలనం
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకలంగా ఉన్నాయి. బీఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకలంగా ఉన్నాయి. బీఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు.
ఇదంతా ఓటింగ్ మిషన్ మాయాజాలం అన్నారు. మా ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఈవీఎంలను తయారు చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ముస్లీం అభ్యర్థిని కూడా నిలపని బీజేపీ గెలవడం చాలా విడ్డూరం అన్నారు.

బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నారు. యూపీ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిన మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని ఆమె సవాల్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ముస్లీం ఏరియాల్లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలని నిలదీశారు.












Click it and Unblock the Notifications