‘కోర్టు కంటే ముందు ఆస్పత్రికెళితే మంచిదేమో’

Subscribe to Oneindia Telugu

లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపైఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌కి పాల్పడినట్లు మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు

గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాయావతి ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు పలికారు. 'మాయవతి న్యాయస్థానానికి వెళ్తానంటే మేము భయపడము. కానీ ఆమె కోర్టుకు వెళ్లే ముందు ఒకసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఆమెకు విశ్రాంతి అవసరం' అని ఎద్దేవా చేశారు.

Mayawati should visit hospital to get treated: BJP leader Keshav Prasad Maurya on EVM tampering allegations

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంల్లో అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని.. ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తుతామని ఆమె చెప్పిన విషయం తెలిసిందే.

కాగా, యూపీ ఎన్నికల్లో 403 సీట్లకు గానూ బీజేపీ(312), మిత్ర పక్షాలతో కలిపి 325 స్థానాల్లో గెలుపొందింది. ఎస్పీ 47, బీఎస్పీ 19, ఆర్ఎల్డీ 1, నిషద్1, ఇండిపెండెంట్(3) సీట్లు గెలుచుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttar Pradesh Bharatiya Janata Party (BJP) unit president Keshav Prasad Maurya on Thursday took a dig at Bahujan Samaj Party (BSP) supremo Mayawati for claiming that EVMs were tampered during UP Assembly polls.
Please Wait while comments are loading...