మోడీ వ్యతిరేక ఎంఎంఎస్: ఎంబిఎ విద్యార్థి అరెస్టు

విచారించిన తర్వాత నలుగురిని పోలీసులు విడుదల చేశారు. సయీద్‌ను మాత్రం ఐటి చట్టం కింద అరెస్టు చేశారు. ఎప్పుడు అతన్ని అరెస్టు చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. సయీద్ ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ కాలేజీలో చదువుతున్నాడు.
అతను ఇతర విద్యార్థులతో కలిసి వసంత్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతని మొబైల్ నెంబర్‌ను పోలీసులు కనిపెట్టారు. ఆర్‌టిఐ కార్యకర్త జయంత్ తినైకర్ పోలీసులకు ఎంఎంఎస్ పంపిణీపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పోలీసులకు మే 16వ తేదీన అందింది.
పేస్‌బుక్‌లో నరేంద్ర మోడీపై గోవాలో ఓ వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications