MBA student: గ్యాంగ్ రేప్ చేసినప్పుడు నేను అక్కడ ఉన్నానా ?, నేను ఏమైనా చూశానా, బీజేపీ ఎంపీ !
బెంగళూరు/ మైసూరు/ దావణగెరె: దేశవ్యాప్తంగా కలకలం రేపిందిన మైసూరు కాలేజ్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోమ్ మంత్రి ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైమ్ లో ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్లాలి అంటూ కర్ణాటక హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరువాత విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అలాగే అసహనంగా మాట్లాడటంతో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో నేను అక్కడ ఏమైనా ఉన్నానా, లేక నేను ఏమైనా చూశానా ? ఎందుకు పదేసదే ఆ ప్రశ్న వేసి విసిగిస్తున్నారని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మండిపడిన బీజేపీ ఎంపీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిందిన మైసూరు కాలేజ్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైసూరు గ్యాంగ్ రేప్ విషయంలో కర్ణాటకలోని దావణగెరె బీజేపీ ఎంపీ జీఎం. సిద్దేశ్వర మీడియా ముందు అసహనం వ్యక్తం చేశారు.

నేను అక్కడ ఉన్నానా ? నేను ఏమైనా చూశానా
మైసూరు కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ విషయం నన్ను ఎందుకు అడుగుతున్నారని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర మీడియాను ప్రశ్నించారు. గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో నేను అక్కడ ఏమైనా ఉన్నానా ?, లేక నేను ఏమైనా చూశానా ? ఎందుకు పదేసదే ఆ ప్రశ్న వేసి విసిగిస్తున్నారని, ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తనకు చాలా పనులు ఉంటాయని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర చాలా నిర్లక్షంగా సమాధానం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. బీజేపీ ఎంపీ సిద్దేశ్వర చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మైసూరు నగరం శివార్లలోని చాముండికొండ మీద జరిగిన కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో కర్ణాటక హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతరాత్రి పూట నిర్జనప్రదేశంలోకి కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు వెళ్లాలి? అలా వెళ్లకుండా ఉండాల్సింది, అలాంటి సమయంలో అందరిని ఆపడం మనకు సాధ్యం కాదని హోమ్ మంత్రి మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ప్రతిపక్షాలను వదల్లేదు
తన మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హోమ్ మంత్రి మండిపడ్డారు. మైసూరులో కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే కుళ్లు రాజకీయాలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద రేప్ చేస్తున్నారని బెంగళూరులో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. మైసూరు గ్యాంగ్ రేప్ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే బీజేపీ నాయకులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటంతో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇరకాటంలో పడుతున్నారు. మైసూరు ఎంబీఏ విద్యార్థిని కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. మొత్తం మీద కాలేజ్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు కర్ణాటక లోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.












Click it and Unblock the Notifications