మరో భారీ స్కాం: 2009 నుంచి 2014 వరకు నో ట్యాక్స్, టెక్నో మ్యాక్ రూ.6000 కోట్ల చీటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో మరో భారీ కుంభకోణం బయటపడింది. టెక్నోమ్యాక్ అనే కంపెనీ రూ.6000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది.

ఇండియన్ టెక్నోమాక్ కంపెనీపై రూ.2175 కోట్ల పన్నుతో పాటు రూ.2167 కోట్లు వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టింది. విద్యుత్ శాఖకు రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.

MD, directors of Himachal Pradesh company booked for cheating government, banks of Rs 6,000 crore

అన్నీ కలిపి రూ.6వేల కోట్లకు ఎగనామం పెట్టింది. 2009కి ముందు స్థాపించిన ఈ కంపెనీ తప్పుడు ధృవపత్రాలతో సేల్స్ ట్యాక్స్ మినహాయంపు పొందింది. దీంతో 2009 నుంచి 2014 వరకు సేల్స్ ట్యాక్స్ చెల్లించలేదు. ఆ తర్వాత కార్యకలాపాలు నిలిపేసింది.

పన్ను మినహాయింపు కోసం పెట్టిన దొంగ నివేదికలనే పలు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడానికి వాడింది. దాదాపు 16 బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Himachal Pradesh Police have registered a case against the managing director and three directors of the Indian Technomac Company Limited for allegedly defrauding a number of government departments and a consortium of banks of more than Rs 6,000 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి