భారత వైద్య మండలి రద్దు - అమలులోకి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం - కేంద్రం గెజిట్

దేశంలో వైద్య విద్యకు సంబంధించి మోదీ సర్కార్ చేపట్టిన అతి పెద్ద సంస్కరణలకు కార్యరూపందాల్చింది. గతేడాది జులైలో పార్లమెంట్ ఆమోదం తర్వాత చట్టంగా మారిన 'నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం-2019' శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య విద్య నియంత్రణ సంస్థ భారత వైద్య మండలి(ఎంసీఐ)లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, దాని వల్ల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందడంలేదని, వైద్య విద్యలో సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఎన్ఎంసీ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఎంసీఐ రద్దు.

ఎంసీఐ రద్దు.

కొత్తగా అమల్లోకి వచ్చిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం-2019 చట్టం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో వైద్యవిద్యను నియంత్రిస్తున్న భారత వైద్య మండలి లేదా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను (ఎంసీఐ) రద్దయిపోయింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ యాక్ట్ -1956 ప్రకారం ఏర్పాటైన ఎంసీఐ దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. రద్దయిన ఎంసీఐ స్థానంలో ఏర్పాటైన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఇవాళ్టి నుంచి ఉనికిలోకి వచ్చింది. ఎన్‌ఎంసీ పరిధిలో వైద్యవిద్యను నియంత్రించేందుకు మొత్తం నాలుగు బోర్డులను ఏర్పాటుచేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది.

ఆ నాలుగు బోర్డులు ఏవంటే..

ఆ నాలుగు బోర్డులు ఏవంటే..

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు, మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు, ఎథిక్స్‌ అండ్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డులను ఏర్పాటుచేసిన కేంద్రం.. వాటికి అధ్యక్షులను, సభ్యులను నియమించారు. ఎంసీఐ జనరల్ సెక్రటరీగా పనిచేసిన రాకేశ్ కుమార్ వత్స్ ఎన్ఎంసీ సెక్రటరీగా కొనసాగుతారని కేంద్రం తెలిపింది.

విద్యార్థులు, వైద్యుల వ్యతిరేకత

విద్యార్థులు, వైద్యుల వ్యతిరేకత


నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంలో వైద్య విద్యార్థులు, వైద్యులు తీవ్ర వ్యతిరేకత కనబర్చారు. పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు సైతం చేపట్టడం విదితమే. ఎన్‌ఎంసీ ద్వారా వైద్య విద్యలో ప్రభుత్వ ఆధిపత్యం పెరుగుతుందని, ఎన్‌ఎంసీ తీసుకునే అన్ని నిర్ణయాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరికగా, ఎన్ఎంసీలో ఆ పరిస్థితి ఉండబోదని, అదేసమయంలో వైద్య రంగ నిపుణులకు ప్రాధాన్యం తగ్గుతుందని స్డూడెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటి కంటే ప్రధానంగా కొత్త చట్టంలో.. ప్రైవేటు కళాశాలలకు యాభై శాతం సీట్లకు ఫీజులు నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించారని ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమేనని విద్యార్థులు ఆరోపించారు. శుక్రవారం చట్టం అమలులోకి వచ్చిన సందర్భంలో ఎక్కడా నిరసనలు చోటుచేసుకున్నట్లు రిపోర్టులు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+