తమిళనాడులో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన వైద్య విద్యార్థుల వాహనం.. నలుగురు మృతి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు మృతిచెందారు. తిరువణ్ణామలై సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వైద్య విద్యార్థులు తిరువణ్ణామలై నుంచి తిండివనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం అతి వేగమనేనని తెలుస్తోంది.
ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున సంభవించింది. తిరువణ్ణామలై సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. చిన్న కంగేయనూరు సమీపంలో కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన, అనంతరం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలో విల్లుపురం జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ఈ విద్యార్థులంతా కలిసి తిండివనం మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నట్టు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే, వారంతా చనిపోయారు. పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ ప్రక్రియ చేపట్టారు. ఇక, ఈ ప్రమాదం గురించి మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం అతివేగమనని పోలీసులు నిర్థారించారు.












Click it and Unblock the Notifications