వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు ''బాహుబ‌లి'': ప‌వ‌న్‌క‌ల్యాణ్ కంటే చిరంజీవి బ‌ల‌వంతుడా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపు సామాజిక వ‌ర్గం ఎప్ప‌టినుంచో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టాల‌ని ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తిసారీ నిరాశ‌కు గుర‌వుతోంది. 2009లో సినీన‌టుడు చిరంజీవి ''ప్ర‌జారాజ్యం'' ద్వారా త‌మ చిర‌కాల వాంఛ తీరుతుంద‌నుకుందికానీ ప్ర‌జ‌లు ఆయన్ను ఆ సామాజిక‌వ‌ర్గానికి ప్ర‌తినిధిగానే చూసి కాంగ్రెస్ పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. ఓట్లు చీలిపోయి తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలోని ''మ‌హాకూట‌మి'' చ‌తికిల‌ప‌డింది.

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది

2014లో న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత అన్ని రాష్ట్రాల్లో బ‌లోపేత‌మ‌వుతూ వ‌స్తోన్న బీజేపీకి ద‌క్షిణాది మాత్రం కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. ఈసారి ప‌శ్చిమ‌బెంగాల్ త‌ర‌హా యుద్ధాన్ని తెలంగాణ‌లో పున‌రావృతం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఏపీని మాత్రం 2029కి ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈలోగా అన్ని సామాజిక‌వ‌ర్గాల‌ను ద‌రిచేర్చుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. మొద‌టిగా ఆ పార్టీ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని కాపుల‌పై దృష్టి సారించింది. వ్యూహంలో భాగంగానే 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌న‌సేన‌తో జ‌ట్టు క‌ట్టింది. ఏపీ బీజేపీలోని నేత‌లు కొంద‌రు అధికార వైసీపీకి లోపాయికారీగా స‌హ‌క‌రిస్తున్నార‌ని బ‌లంగా న‌మ్ముతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి దూరం జ‌ర‌గ‌డం ప్రారంభించారు.

 మిత్రుడు దూరమవుతున్నా మౌనం దేనికి సంకేతం?

మిత్రుడు దూరమవుతున్నా మౌనం దేనికి సంకేతం?

కేంద్రంలో వైసీపీతో అవ‌స‌రం ఉండ‌టంతో ప్ర‌స్తుతానికి మిత్రుడు దూర‌మ‌వుతున్నా కేంద్రం మౌనంగానే ఉంది. ప‌వ‌న్ దూర‌మ‌వుతారు.. తెలుగుదేశం పార్టీతో జ‌త‌క‌డ‌తార‌నే ఉద్దేశంతో ఉన్న బీజేపీ పెద్ద‌లు ఆ లోటును చిరంజీవితో పూడ్చుకోవాల‌ని భావిస్తున్నారు. భీమ‌వ‌రం స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీ చిరంజీవికి అత్యంత ప్రాధాన్య‌మిచ్చారు. కొద్దిసేపు ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌తంగా ముచ్చ‌టించారు. వీటిపై ప‌లురకాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టిన‌ప్ప‌టికీ ఆయన ప్రాధాన్యం మాత్రం సినిమాల‌కేన‌ని స్ప‌ష్ట‌మైంది. ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన చిరంజీవిపై ఆ సామాజిక‌వ‌ర్గంలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే.
బీజేపీ పెద్దలు మాత్రం ఏపీలో పవన్ కల్యాణ్ కంటే చిరంజీవినే కాపు సామాజికవర్గానికి ''పెద్ద''గా పరిగణిస్తున్నారనేది స్పష్టమవుతోంది.

 పట్టుదలగా ఉంటే ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవారు?

పట్టుదలగా ఉంటే ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవారు?

ఆరోజు నుంచి పార్టీని ప‌ట్టుద‌ల‌గా న‌డుపుతూ వ‌స్తే ఈ స‌మ‌యానికి చిరంజీవి ముఖ్య‌మంత్రిగా ఉండేవార‌ని, కాపుల కోరిక కూడా తీరేద‌ని ఆ సామాజిక‌వ‌ర్గం భావిస్తోంది. కానీ ఆయ‌న పార్టీని విలీనం చేయ‌డంపై కాపుల్లోనే కాకుండా చిరంజీవి అభిమానులందరిలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం తాను 25 సంవ‌త్స‌రాల‌పాటు రాజ‌కీయం చేయ‌డానికే వ‌చ్చాన‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఆ ప్ర‌కార‌మే న‌డుచుకుంటాన‌న్నారు. చిరంజీవిక‌న్నా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పైనే కాపుల‌కు ఎక్కువ ''విశ్వ‌స‌నీయ‌త'' ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. చిరంజీవిని త‌న పార్టీలోకి ఆహ్వానించాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్న బీజేపీ ''విశ్వ‌స‌నీయ‌త'' కూడా రాజ‌కీయాల్లో ముఖ్య‌మేన‌నే విషయాన్ని మ‌ర్చిపోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రాజకీయం కావాలో? విశ్వసనీయత కావాలో? నరేంద్రమోడీ, అమిత్ షా తేల్చుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటివరకు ఏపీ ప్రజలు మాత్రం భారతీయ జనతాపార్టీకి దూరమేనని చెప్పవచ్చు..!!

English summary
mega star Chiranjeevi stronger than power star Pawan Kalyan? who is kapu bahubali?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X