మాజీ రాష్ట్రపతిపై అప్పుడే విమర్శల దాడి: రాజ్యాంగం పేరుతో బీజేపీ పొలిటికల్ అజెండా అమలు
శ్రీనగర్: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి పేద, గిరిజన మహిళ సాధించిన విజయంగా అభివర్ణించారు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.
ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రాష్ట్రపతి భవన్‌ను వీడారు. నంబర్ 12, జన్‌పథ్ బంగళాకు షిఫ్ట్ అయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ మాజీ కావడంతో ఇక ఆయనపై ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటలదాడిని మొదలు పెట్టారు. ఆయన హయాంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత వివాదాస్పద బిల్లులు, చట్టాలను ఆధారంగా చేసుకుని కోవింద్‌పై ఆరోపణలను గుప్పిస్తోన్నారు.

ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. కోవింద్‌పై ఘాటు విమర్శలను సంధించారు. రాజ్యాంగం పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయ అజెండాను ఆయన అమలు చేశారని ఆరోపించారు. కోవింద్ హయాంలో రాజ్యాంగం పలుమార్లు ఉల్లంఘనకు గురైందని చెప్పారు. ఈ మేరకు ఆమె ఈ ఉదయం తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్టులు పెట్టారు.
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022
రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అజెండాను అమలు చేశారని మండిపడ్డారు. ఒక దుస్సంప్రదాయాన్ని కోవింద్ మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అంశాన్ని మెహబూబా ముఫ్తీ ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ చట్టం పైనా మాట్లాడారు. దళితులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు నల్ల చట్టాలకు కోవింద్ మద్దతు పలికారని ధ్వజమెత్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications