Narendra Modi ఎన్నికల ఫలితాల్లో గ్రాండ్ విక్టరీ: బీజేపీ అంటే ప్లవర్ అనుకుంటివా.. ఫైర్.. పుష్ప మూడ్‌లో మోడీ!
5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది. పంజాబ్ మినహా 4 చోట్ల బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దీంతో అక్కడ కమల దళమే తిరిగి అధికారం చేపట్టబోతుంది. ఎన్నికలకు ముందు.. విపక్షాలు కూడా గట్టిగానే ప్రచారం చేశాయి. కానీ ఓటర్లు మాత్రం తిరిగి మోడీకి జై కొట్టారు. అన్నీ చోట్ల మోడీ ప్రభ బీజేపీకి కలిసి వచ్చింది. యూపీలో కూడా మోడీ గట్టిగానే ప్రచారం చేశారు. అలాగే యోగి ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. నేరస్తులపై కఠిన చర్యలు కూడా ఆ పార్టీకి బూస్టింగ్‌గా మారాయి. దీంతో వార్ వన్ సైడ్ జరిగి.. కమలం వికసించింది.
Recommended Video
తగ్గేదేలే అంటోన్న మోడీ..
ట్రెండ్స్ బట్టి బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగడంతో సంబరాలు నెలకొన్నాయి. సోషల్ మీడియా మోడీని ఆకాశానికి ఎత్తివేసింది. కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. అందులో ఒకటి ఇటీవల వచ్చిన పుష్ప మూవీలోనిది.. హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ జనంలోకి బాగా వెళ్లింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అని కామెంట్ చేశారు. అదీ చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ప్రధాని మోడీ ఫోటోతో మీమ్ వచ్చింది. అందులో మోడీ నెరసిన గడ్డం కింద చేయి అడ్డుపెట్టుకొని ఉన్నారు. అచ్చం అల్లు అర్జున్ మాదిరిగా ఉన్నారు.

ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. ఫైర్
దానిని కొందరు ట్వీట్ చేశారు. అందులో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని రాశారు. కాదు ఫైర్.. ఫైర్ అంటూ రాసుకొచ్చారు. బంపర్ మెజార్టీతో గెలవడంతో బీజేపీ సోషల్ మీడియా ఇలా మోడీ మీమ్ హైలెట్ చేసింది. దానిని అంతా షేర్ చేయడంతో.. ట్రోల్ అవుతుంది. బీజేపీ శ్రేణులు అంతా పుష్ప మూడ్‌లో ఉన్నారు. తగ్గేదేలే అంటు ఉన్నారు. తమ పార్టీ విశ్వ రూపం చూపించిందని కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీ ఊహించిన దాని కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది. దీంతో కమల దళం సంబరాల్లో మునిగిపోయింది.

మోడీ- యోగీ.. బంపర్ విక్టరీ
యూపీలో గెలవడం అన్నీ పార్టీలకు ఇంపార్టెంట్.. యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అనుకున్నారు. అఖిలేశ్ యాదవ్.. తెగ కష్టపడ్డారు. కానీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం చేసింది. ప్రియాంకు బాధ్యతలు అప్పగించారు. ఒకనొక క్రమంలో సీఎం అని కూడా ప్రకటన చేశారు. తర్వాత నాలిక కరుచుకొని మిన్నకుండిపోయారు. కానీ ఆ పార్టీ యూపీలో సింగిల్ డిజిట్ రావడం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా.. 10-20 కదా అంటున్నారు. బీఎస్పీ పరిస్థితి కూడా అదే.. అవును ఆ పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే పరిస్థితి ఉంది. యోగి వైపు జనం మొగ్గు చూపారు. అందుకు మోడీ మేనియా పనికి వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో క్రేజీ పోస్టులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications