కారులో టెక్కీకి లిఫ్ట్ ఇచ్చి ఎటిఎం కార్డు లాక్కుని లక్షన్నర దోచుకున్నారు

పూణే: పరిచయం లేని వ్యక్తుల వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దోపిడీకి గురయ్యాడు. ఇంటి వద్ద దింపేస్తామని నమ్మబలికి కొంత మంది వ్యక్తులు హింజేవాడిలోని ఐటి కంపెనీలో పనిచేస్తున్న ఓ టెక్కీకి లిఫ్ట్ ఇచ్చి అతని వద్ద ఉన్న లక్షన్నర రూపాయలు దోచుకున్నారు.

కారులో ఎక్కిన టెక్కీ నుంచి బలవంతంగా ఎటిఎం పిన్ నెంబర్ తీసుకున్నారు. తద్వారా రవి శంకర్ గోపాల్ (34) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు లక్షన్నర రూపాయలను వివిధ ఎటిఎం కేంద్రాల్లో డ్రా చేసుకున్నారు. మూడున్నర గంటల పాటు అతన్ని ఎక్కడెక్కడో తిప్పి చివరికి వాకాడ్‌లోని కాస్పాటేలో పడేసి పోయారు.

ఆ దోపిడీ మంగళవారంనాడు జరగగా దిగ్భ్రాంతికి గురైన గోపాల్ బుధవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆఫీస్ ఏర్పాటు చేసిన క్యాబ్‌ను అతను అందుకోలేకపోయాడు. దాంతో ఇంటికి బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

Men in car offer techie lift, rob him of Rs 1.5L in Pune

కంపెనీ వద్ద ఉన్న రిక్వెస్ట్ బస్సు స్టాపులో నించున్న గోపాల్ వద్ద ఓ తెల్లటి కారు వచ్చి ఆగింది. డ్రైవర్ అతనికి లిఫ్ట్ ఆఫర్ చేశాడు. విశాల్‌నగర్‌లోని ఇంటికి సమీపంలో దింపుతానని హామీ ఇచ్చాడు.

డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా కారులో కూర్చుని ఉన్నాడు. అయితే, తనకేదో జరుగుతుందని గోపాల్ ఊహించలేకపోయాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ మరో ఇద్దరిని కారులో ఎక్కించుకున్నాడు.

పక్కన కూర్చున్న వ్యక్తి పదునైన ఆయుధాన్ని తీసి గోపాల్‌ను బెదిరించాడు. కేకలు వేయడానికి ప్రయత్నించిన గోపాల్‌ను చంపుతానని బెదిరించాడు. గోపాల్ వ్యాలెట్‌ను లాక్కుని, పిన్ నెంబర్ చెప్పాలని భయపెట్టాడు. ఆ తర్వాత లక్షన్నర రూపాయలు డ్రా చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+