షర్ట్ విప్పేసి .. పోల్‌కు కట్టి : దబిడి దిబిడి ...

నోయిడా : అక్కడ అనుమానం పెనుభూతమైంది. తమ వస్తువు చోరీకి గురైన చోట వారు ఉండటమే పాపమైపోయింది. వారిద్దరి షర్ట్ విప్పి .. పోల్ కు కట్టేసి కొట్టారు. ఈ విషాదకర ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. అయితే ఈ వీడియోను ఓ నెటిజన్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని .. విచారణ ఆధారంగా దాడిచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పస్టంచేశారు.

దొంగతనం పేరుతో ..
నోయిడాలోని సెక్టార్ 26 వద్ద ఎప్పటిలాగే ఆటోను పార్కింగ్ చేశారు. అయితే ఆటో బ్యాటరీని దొంగిలించారు. ఎవరిపై అనుమానం లేదు .. కానీ ఆటో పార్కింగ్ చేసే చోట మరునాడు గుర్తుతెలియని యువకులు కూర్చొన్నారు. ఇదే వారి పాపమైంది. వారు కొత్తవారు కావడం .. అనుమానాస్పదంగా కనిపించడంతో వారు దొంగిలించారని నిర్ధారణకు వచ్చారు. ఎవరు ? ఏంటీ ? ఎక్కడి నుంచి వచ్చారు అని అడక్కుండా .. వారిని లాక్కెళ్లారు. షర్ట్ లు విప్పేసి .. పోల్ కు కట్టేశారు. ఇత తమ చేతులకు పనిచెప్పి దాడికి తెగబడ్డారు. ఈ దాష్టీకాన్ని ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

Men tied to pole, bashed over suspected battery theft in Noida

వైరలవడంతో ...
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా ఘటనపై విచారణ జరుపుతున్నాని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వారు నిజంగా బ్యాటరీ దొంగిలించారా ? ఏ ఆధారంతో దాడి చేశారనే అంశంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. విచారణ ఆధారంగా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు. ఎలాంటి ఆధారం లేకుండా మూకుమ్మడి దాడి చేయడం తగదని .. చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుచేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+