వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోదుస్తులు విప్పించడం కరెక్టేనట: రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు కుక్కలుగా పుడతారట..!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: మహిళల రుతుస్రావంపై గుజరాత్‌కు చెందిన స్వామిజీ ఒకరు కొన్ని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావ రోజులను గుర్తించడానికి 68 మంది విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను ఆయన సమర్థించారు. విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు ఎద్దులుగా జన్మిస్తారనీ ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు, లోకేష్ ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు: ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: కళా వెంకట్రావుచంద్రబాబు, లోకేష్ ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు: ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: కళా వెంకట్రావు

ఆ స్వామిజీ పేరు కృష్ణస్వరూప్ దాస్‌జీ. గుజరాత్‌లోని భుజ్‌లో 68 మంది విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన కళాశాల ఈ స్వామిజీకి చెందినదే. 2012లో ఆయన శ్రీ సహజానంద బాలికల కళాశాలను భుజ్‌లోని స్వామి నారాయణ్ ఆశ్రమం ప్రాంగణంలో నెలకొల్పారు. తరచూ ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలను నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా భుజ్‌లో ఏర్పాటు చేసిన రాత్ కీ సభ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Menstruating women who cook will be reborn as dogs: Krushnaswarup Dasji

మగవారు తప్పనిసరిగా వంట నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి కారణాలు లేకపోలేదంటూ కొన్ని సందర్భాలను ఆయన ఉటంకించారు. రుతుస్రావం రోజుల్లో మహిళలను గడప దాటి లోనికి రానివ్వకూడదని, వంటగదిలోకి అస్సలు ప్రవేశాన్ని కల్పించకూడదని అన్నారు. రుతుస్రావం రోజుల్లో వంట వండే మహిళలు మరు జన్మలో కుక్కలుగా పుడతారని అన్నారు. అలాంటి సమయంలో వారు వండిన ఆహారాన్ని భుజించిన మగవారు ఎద్దుగా జన్మిస్తారని చెప్పారు.

Recommended Video

Viral Video : Lioness & Her Cubs Make Way For Biker In Gujarat | Oneindia Telugu

ఆ మూడు రోజుల పాటు సొంతంగా వంటను వండుకోవాల్సిన అవసరం మగవారికి ఉందని అన్నారు. తాను భయపెట్టడానికో లేదా మహిళలను కించపరచడానికో ఈ విషయాన్ని చెప్పట్లేదని, పురాణాల్లో ఉన్న విషయాన్ని ఉటంకిస్తున్నానని అన్నారు. ఆయన ప్రవచనాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను కృష్ణ స్వరూప్ దాస్‌జీ సమర్థించుకున్నారు. అందులో తప్పేమీ లేదని అన్నారు. రుతుస్రావ రోజుల్లో విద్యార్థినులు కట్టుబాట్లను పాటించి తీరాల్సి ఉంటుందని చెప్పారు.

English summary
Videos from preachings of one Krushnaswarup Dasji -- the spiritual leader of the Swaminarayan Bhuj Mandir sect, whose followers run the Bhuj hostel reveal the regressive attitudes that still prevail around menstruation. "If you eat food prepared by a menstruating woman even once then your next avatar will definitely be that of an ox," the guru can be heard saying at one gathering. He has more insights -- "A menstruating woman who cooks food for her husband will certainly be reborn as a kutri’ (bitch)."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X