సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ మోసాలు:నకిలీ పెట్టుబడి ప్రకటనలపై కేంద్ర హోంశాఖ వార్నింగ్..!!

ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ చేసిన వీడియోలతో పెట్టుబడి, పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తీవ్రంగా హెచ్చరించింది. పౌరులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సైబర్ నేరాలకు సంబంధించిన పలు కేసులను ఉటంకిస్తూ, నకిలీ యాడ్‌లు, మార్ఫింగ్ వీడియోలను ఉపయోగించి పెట్టుబడి, ఉద్యోగ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. బేగంబజార్‌కు చెందిన ఓ 25 ఏళ్ల వ్యక్తి రూ. 12.56 లక్షలు, బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ రూ. 3.75 కోట్లు కోల్పోయినట్లు తెలిపింది. సైబర్ మోసాల గురించి జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని పౌరులకు సూచించింది.

తాజా ఘటనలో, బేగంబజార్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసంలో రూ. 12.56 లక్షలు కోల్పోయారు. మోసగాళ్లు నకిలీ యాప్, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు. మోతీలాల్ ఓస్వాల్ లోగోతో కనిపించిన ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనను నిజమని నమ్మిన బాధితుడు, దానిపై క్లిక్ చేయగా నకిలీ ఆర్థిక సలహాదారులు నిర్వహించే వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లారు.

మోద్మా అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఆ వ్యక్తిని ఒప్పించారు. ప్రారంభంలో లాభాలు వస్తున్నట్లు చూపించి నమ్మకం కలిగించారు. తర్వాత "విడుదల రుసుము" కింద రూ. 7.6 లక్షలు అదనంగా చెల్లించమని అడిగినప్పుడు, తాను మోసపోయానని బాధితుడు గ్రహించారు.

మరో ఆందోళనకరమైన కేసులో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోలలో, రూ. 22,000 డిపాజిట్ చేస్తే నెలకు రూ. 50,000 ఆదాయం ఇస్తామనే ప్రభుత్వ మద్దతుగల పెట్టుబడి ప్రణాళికను ఆమె స్వయంగా ప్రచారం చేస్తున్నట్లు చూపించడానికి ఆమె ముఖం, వాయిస్‌ను మార్చారు.

ఈ వీడియోలు నకిలీవని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేసినప్పటికీ, చాలా మంది ఇలాంటి మోసాలకు బలయ్యారు. అదేవిధంగా, బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ఆధ్యాత్మిక గురువు సద్గురు స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రచారం చేస్తున్నట్లు చూపిన మార్ఫింగ్ వీడియో ద్వారా తప్పుదోవ పట్టి, రూ. 3.75 కోట్లు కోల్పోయారు.

మిర్రాక్స్ అనే పేరును ఉపయోగించి, మోసగాళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆమెను సంప్రదించారు. వీడియో కాల్స్‌లో ఆమెకు ట్రేడింగ్ సెషన్‌లలో మార్గనిర్దేశం చేశారు. ఇది నిజమని నమ్మిన ఆమె పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేసింది, వాటిని ఆమె ఎన్నటికీ తిరిగి పొందలేకపోయింది.

ఇలాంటి నకిలీ పెట్టుబడి, ఉద్యోగ ప్రకటనలు అవాస్తవ రాబడులు లేదా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను వాగ్దానం చేస్తాయని MHA హెచ్చరించింది. ఇవి కేవలం డబ్బు, వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి మాత్రమే రూపొందించబడ్డాయని పేర్కొంది. పెరుగుతున్న ఈ ఆందోళనను పరిష్కరించడానికి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తన అవగాహన ప్రచారాలు, పర్యవేక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా నివేదించాలని పౌరులను కోరింది. ప్రముఖులు లేదా ప్రభుత్వ అధికారులను అనుకరించే తప్పుదోవ పట్టించే ప్రకటనలు, మార్ఫింగ్ వీడియోలను గుర్తించి, తొలగించాలని MHA సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు సూచించింది.

ఇలాంటి ఘటనలను నివారించడానికి ప్రజల అప్రమత్తత, తక్షణ ఫిర్యాదులు చాలా అవసరం. సైబర్‌దోస్త్ (CyberDost)తో ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి. మీరు మోసానికి గురైతే, వెంటనే 1930 లేదా cybercrime.gov.in కి ఫిర్యాదు చేయండి.

YouTube - https://youtube.com/@cyberdosti4c

Instagram- https://www.instagram.com/cyberdosti4c?igsh=c2tteTd5Mjl2b2cw

Facebook- https://www.facebook.com/share/1KVuL1aJ9y/?mibextid=wwXIfr

X- https://x.com/cyberdost?s=11

Whatsapp- https://whatsapp.com/channel/0029Va3VAOY8fewrOtXqMw1V

Daily hunt - https://m.dailyhunt.in/profile/I4C_MHA

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+