జమ్మూ కాశ్మీర్‌లో కూలిన మిగ్: పైలట్ మృతి

మామూలు వ్యవహారంలో భాగంగా ఆకాశంలోకి ఎగిరిన మిగ్ - 21 శ్రీనగర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో గల మిర్హామా పొలాల్లో కూలిపోయింది. రఘు బన్సీ అనే పైలట్ ఈ ప్రమాదంలో మరణించాడు.
మంగళవారం ఉదయం సాంకేతిక విమానాశ్రయం నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణమేమిటనేది తెలియదు. సంఘటనా స్థలానికి భారత వైమానిక దళం అధికారులు చేరుకున్నారు.
కాగా, రక్షణ శాఖ సేకరణ అంశాన్ని కొత్త కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో కోరారు.












Click it and Unblock the Notifications