శ్రీనగర్ లో కుప్పకూలిన మిగ్-21 విమానం
శ్రీనగర్: రన్ వే మీద ల్యాండ్ అవుతున్న మిగ్ -21 విమానం కుప్పకూలిపోయింది. మంగళవారం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో భారత భద్రతా దళాలకు చెందిన మిగ్ -21 విమానం కూలిపోవడంతో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.
మంగళవారం ఒకే ఒక్క పైలెట్ తో మిగ్ -21 విమానం ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ విమానం కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్ క్షేమంగా బతికిబయట పడ్డాడు.

జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల దాడుల తీవ్రమైన సమయంలో భారత భద్రతా దళాలకు చెందిన విమానం కూలిపోవడంతో రక్షణ శాఖ ఉలిక్కిపడింది. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications