గోవా రన్ వేపై కూలిన మిగ్29 విమానం: పైలట్, ట్రెయినీ సురక్షితం

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: పనాజీ: ఎంఐజి-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్టులో మంటలు వచ్చాయి. ఆ తర్వాత అది కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ఓ ట్రెయినీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఎంఐజీ 29కే ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీకి చెందినది. ఇది శిక్షణ ఇచ్చే విమానం.

MiG-29k fighter plane on training sortie catches fire at Goa airport

బుధవారం మిగ్ 29కే యుద్ధ విమానం కూలినట్లు అధికారులు తేల్చారు. ఆ విమనాంలో ట్రెయినీ పైలట్ ఉన్నట్లు తెలిపారు. గోవా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న నేవీకి చెందిన విమానం కొన్ని క్షణాలకే కూలిపోయిందని తెలుస్తోంది.

విమానంలో చెలరేగిన మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గోవా విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్‌వే మీదే మిగ్ శకలాలు పడ్డాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A MiG-29K fighter on a training sortie veered off the runway at Dabolim aiport on Wednesday and caught fire but the pilot ejected safely, an Indian Navy spokesperson said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి