బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: కరోనా రాకముందే చచ్చేటట్లు ఉన్నాం, పోలీసుల దుమ్ములేపిన కూలీలు, మోదీ చెప్పలేదా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ మూడో విడత అమలు కావడంతో వలస కార్మికులను వారి సోంత రాష్ట్రాలకు పంపించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు మా గోడు పట్టించుకోవడం లేదని, కరోనా వైరస్ రాకముందే మేము ఆకలితో చచ్చేటట్లు ఉన్నామని వలస కూలీలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. మా సొంత రాష్ట్రానికి పంపించాలని ఆందోళనకు దిగిన వలస కార్మికులపై పోలీసులు పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Recommended Video

Lockdown 3.0: Zones Wide What Will Open And What Will Remain Shut From May 04 | Oneindia Telugu

తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని ఆందోళనకు దిగిన వలస కూలీలు, కార్మికులు చివరికి పోలీసుల మీద రాళ్ల వర్షం కురుపించి వారి దుమ్ములేపడంతో పలువురికి గాయాలైనాయి. సీనియర్ మంత్రి, సిటీ పోలీసు కమిషనర్ రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చచెప్పారు.
మమ్మల్ని మా సొంత రాష్ట్రాలకు పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పలేదా ? మీరు ఏం చేస్తున్నారు అంటూ వలస కూలీలు, కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

బెంగళూరులో వలస కూలీలు, కార్మికులు

బెంగళూరులో వలస కూలీలు, కార్మికులు

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కొన్ని లక్షల మంది వలస కూలీలు, కార్మికులు జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ అరికట్టడంలో భాగంగా గత 42 రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ కారణంగా కూలిపనులు నిలిచిపోవడంతో బెంగళూరు నగరంలో ఉంటున్న వలస కార్మికులు రోడ్డున పడ్డారు. దాతలు ఇస్తున్న చాలిచాలని భోజనం తింటూ ఇన్ని రోజులు అర్ధ కడుపుతో కాలం గడిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పలేదా !

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పలేదా !

వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఎలాగైనా సొంత ఊర్లకు వెళ్లిపోయి అక్కడే చావో బతుకో తేల్చుకోవాలని వలస కార్మికులు, వలస కూలీలు నిర్ణయించారు అయితే సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో వలస కూలీలు, కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.

 వేల మంది ఒకేసారి రోడ్ల మీదకు వస్తే !

వేల మంది ఒకేసారి రోడ్ల మీదకు వస్తే !

బెంగళూరు నగరంలో కాలం గడుపుతున్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కూలీలు ఒకే సారి వేల మంది రోడ్ల మీదకు వచ్చారు. మమ్మల్ని మా సొంత ఊర్లకు పంపించడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు- ముంబై జాతీయ రహదారి (తుమకూరు రోడ్డు)లో ఆందోళనకు దిగారు.

 ఇప్పుడే పంపిస్తారా ? ఇక్కడే చంపేస్తారా ?

ఇప్పుడే పంపిస్తారా ? ఇక్కడే చంపేస్తారా ?

బెంగళూరు- ముంబై జాతీయ రహదారిపై వెయ్యి మందికిపైగా ఆందోళన చేస్తున్నారని విషయం తెలుసుకున్న పిణ్యా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు మీద నుంచి మీరు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లిపోవాలని, అధికారులతో తాము మాట్లాడుతామని పోలీసులు వారికి చెప్పారు. మమ్మల్ని వెంటనే మా సొంత రాష్ట్రాలకు పంపించాలని, ఇక్కడి నుంచి తాము కదలమని, లేదంటే ఇక్కడే మమ్మల్ని చంపేయాలని వలస కూలీలు తేల్చి చెప్పారు.

 పోలీసుల దుమ్ములేపేశారు

పోలీసుల దుమ్ములేపేశారు

వసల కూలీలు, పోలీసు వర్గాల మధ్య మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన వలస కూలీలు చేతికి చిక్కిన రాళ్లు తీసుకుని పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. చిక్కింది చాన్స్ అంటూ పోలీసుల దుమ్ములేపేశారు. ఈ దాడిలో పిణ్యా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ తో పాటు పలువురు పోలీసులకు గాయాలైనాయి. అంత మంది వలస కార్మికులను కట్టడి చెయ్యలేక పిణ్యా పోలీసులు నానా తంటాలు పడ్డారు.

 మంత్రి, పోలీసు కమిషనర్ ఎంట్రీ

మంత్రి, పోలీసు కమిషనర్ ఎంట్రీ

పోలీసుల మీద రాళ్ల దాడి జరిగిందని తెలుసుకున్న కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ తదితర సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వలస కూలీలతో చర్చించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వెంటనే మీ సొంత రాష్ట్రాలకు పంపిస్తామని మంత్రి ఆర్. అశోక్ వలస కూలీలకు హామీ ఇచ్చారు. అయినా వలస కూలీలకు నమ్మకం లేకపోవడంతో కొన్ని గంటల పాటు అక్కడే ఉండిపోయారు.

 మనం ఏం చెయ్యాలి ?

మనం ఏం చెయ్యాలి ?

కర్ణాటకకు చెందిన వలస కూలీలు, కార్మికులను వారి సొంత ఊర్లకు (కర్ణాటక రాష్ట్రం) పంపించడానికి అక్కడి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఉచితంగా కేఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులు నడుపుతోంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తరలించడానికి రైళ్లు అవసరం అవుతాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను తరలించడానికి అనేక రైళ్లు అవసరం అవుతాయని, ఈ విషయంలో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ? అంటూ బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నది.

English summary
Coronavirus Lockdown: Thousands of migrant workers from Uttar Pradesh and Bihar protested in Bengaluru demanding for transport facility for go to home. Protesters blocked the Bengaluru-Tumakuru highway and pelted stone on police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X