మోదీ విషయంలో గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, చచ్చినా ఆ పని చెయ్యను, అయితే !
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధించడానికి కారణం అయిన ముఖ్యమైన నాయకుల్లో ఒకరైన అప్పటి కమలం పార్టీ నాయకుడు, మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గత 2022లో బీజేపీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2023లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ గుర్తు మీద పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.
తన రాజకీయ జీవితం నాశనం కావడానికి, తాను సహాయం చేసిన నాయకులే కారణం అని, తాను జైలు నుంచి విడుదల అయిన తరువాత, జైల్లో ఉన్న సమయంలో తనను బీజేపీ నాయకులు పూర్తిగా నిర్లక్షం చేశారని, కూరలో కరివేపాకులా తనను వాడుకుని వదిలేశారని అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోని కొందరు నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ టిక్కెట్ మీద కొందరిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించిన గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోప్పళ జిల్లాలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపారు. మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని వెలుగు చూసింది. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మళ్లీ బీజేపీలో చేరిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ వైపు మొగ్గుచూపారు. లోక్‌సభ ఎన్నికల్లో కావాలంటే బీజేపీతో పొత్తుకు సిద్ధమని మాజీ ముంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
ఈ విషయమై శనివారం కుష్టగిలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు. బీజేపీతో పొత్తు లేకుండా మా పార్టీ లోక్‌సభకు పోటీ చేసినా నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి నేను మద్దతిస్తానని, అయితే కేఆర్ పీపీ పార్టీ నుంచి పోటీ చేస్తామని, ఏ కారణం చేత తాను మళ్లీ బీజేపీలో చేరనని, అయితే బయట నుంచి తాను బీజేపీకి మద్దతిస్తానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
కేంద్రంలో, కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీ కాని, తాను కాని మద్దతివ్వబోమని, చచ్చినా ఆపని చెయ్యమని కేఆర్ పీపీ ఎమ్మెల్యే, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని, కేవలం ఉచిత హామీల పథకాల పైనే చర్చ సాగిస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

అయోధ్య తరహాలో కోప్పళ జిల్లాలోని అంజనాద్రిని అభివృద్ధి చేస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇక్కడి ఆలయ అసలు రూపం మారలేదని, కానీ మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నామని, ఫిబ్రవరి నెలాఖరులో అంజనాధ్రిలో ఉత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు సమర్పించామని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు.
మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటికే బీజేపీకి దూరం అయిన నాయకులు మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ దెబ్బతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలవరం మొదలైయ్యిందని తెలిసింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications