డీఎస్పీ హత్య: ట్రక్ డ్రైవర్ అరెస్ట్, ఎన్‌కౌంటర్‌లో ఫైరింగ్, మోకాలి కింద కాల్చిన ఖాకీలు
మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. దేశంలో ఎక్కడైనా సరే అంతే సంగతులు.. అడ్డొచ్చినా పోలీసు, రెవెన్యూ అధికారులను కూడా వదలడం లేదు. హర్యానా నుహ్‌లో డీఎస్పీని వాహనంతో ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. డీఎస్పీ సురేంద్ర సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ట్రక్ డ్రైవర్ ఇక్కర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
తౌరు సమీపంలో గల పచ్‌గొన్ వద్ద గల ఆరావలి హిల్స్ వద్దకు రాత్రి డీఎస్పీ సింగ్ తన బృందంతో కలిసి వెళ్లారు. అయితే ఓ డంపర్ ట్రక్ అటు నుంచి వస్తోంది. అదీ అక్రమ మైనింగ్ చేస్తోంది. వాహనం ఆపి.. పత్రాలు చూపించాలని సింగ్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ డ్రైవర్‌కు తెలుసు.. అందుకే వాహనం మరింత స్పీడ్ పోనిచ్చాడు. ఇంకేముంది డీఎస్పీ గన్ మెన్, డ్రైవర్ అక్కడి నుంచి దుకేశారు. కానీ డీఎస్పీ మాత్రం తప్పించుకోవడానికి వీలు లేదు. తీవ్రంగా గాయపడటంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ నో యూజ్.. అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు.

డీఎస్పీ సింగ్ చనిపోవడంతో.. మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుదామని పోలీసులు అనుకున్నారు. డీఎస్పీ పైనుంచి వెళ్లనిచ్చిన ట్రక్ డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం అన్వేషిస్తుండగా.. దొరికారు. కానీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. మోకాలి కింద తూటా తగిలింది. అతనిని వైద్య పరీక్షల కోసం నల్హర్ మెడికల్ కాలేజీకి పంపించారు.
ఇసుక, సున్నపురాయి, ఇతర ఖనిజాల మైనింగ్ యధేచ్చగా జరుగుతుంటుంది. అనుమతి లేకుండా చేస్తుంటారు. పత్రాలు ఇవ్వాలని కోరితే ఇలా అధికారులనే చంపుతారు. ఇలాంటి ఘటన హర్యానాలో ఇటీవల జరగగా.. వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications