Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగుసార్లు సీఎం అయ్యి సాధించిందేమిటి? కేసీఆర్ తో పోలికా? మధ్యప్రదేశ్ సీఎంకు హరీష్ రావు కౌంటర్

తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దీటుగా సమాధానం ఇచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. 100 ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లుగా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.

నేను నాలుగు సార్లు సీఎం అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్

నేను నాలుగు సార్లు సీఎం అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్


బీజేపీ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పిరికి వాడని ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని పేర్కొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తే దౌర్జన్యంగా అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మీ బెదిరింపులకు బిజెపి భయపడదని కేసీఆర్ కలలోకూడా బండి సంజయ్ ను ఏమీ చెయ్యలేరని గుర్తు చేశారు. కెసిఆర్ నేను కూడా సీఎంనే... మీరు రెండుసార్లు సీఎం కావచ్చు నేను నాలుగోసారి సీఎంను అంటూ పేర్కొన్నారు. బిజెపి అంటే బిర్యాని అనుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన మీకు కేసీఆర్ తో ఏం పోలిక

దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన మీకు కేసీఆర్ తో ఏం పోలిక


ఇక ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన మీకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం పోలిక లేదని, నాలుగు సార్లు సీఎం అయ్యి ఏం సాధించారో చెప్పాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏ రంగంలో మధ్య ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధించిందో చెప్పాలంటూ నిలదీశారు. అసలు మధ్య ప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తో ఏ విధంగా పోలుస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

అవినీతి గురించి మీరా మాట్లాడేది? వ్యాపం కుంభకోణం సంగతేంటి?

అవినీతి గురించి మీరా మాట్లాడేది? వ్యాపం కుంభకోణం సంగతేంటి?


శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగింది అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. మీ కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరగలేదు అని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణతో మీ రాష్ట్రం దేనికి పోలిక లేదని మధ్యప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద వ్యాపం కుంభకోణం సంగతేంటి అంటూ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ఎవరికైనా శిక్ష పడిందా అంటూ మంత్రి హరీష్ రావు నిలదీశారు.

ద్యోగాలు రావద్దని బిజెపి కుట్రలు చేస్తుందంటూ ఆగ్రహం

ద్యోగాలు రావద్దని బిజెపి కుట్రలు చేస్తుందంటూ ఆగ్రహం


మీరు మనుషుల్ని చంపేశారని మీ కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్న మంత్రి హరీష్ రావు మరి వాటి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ భావిస్తుంటే, అసలు ఉద్యోగాలు రావద్దని బిజెపి కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు. 317 జీవోను ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా అంటూ బిజెపి నేతలను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అంటూ ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు బిజెపి కావాలని కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు.

కేసీఆర్ పై చేసిన విమర్శలు సూర్యుడి మీద ఉమ్మేసినట్టే

కేసీఆర్ పై చేసిన విమర్శలు సూర్యుడి మీద ఉమ్మేసినట్టే


సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు సూర్యుడి మీద ఉమ్మేసినట్టు ఉంటుందని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు . మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గొప్పగా పాలన సాగితే మధ్యప్రదేశ్ కూలీలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పని చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఏ రంగంలో కూడా మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సాటి రాదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో చెప్పుకోవటానికి గొప్పగా చేసింది ఏమీ లేదన్నారు. స్థానిక నాయకులు రాసిన స్క్రిప్టు చదివితే అభాసుపాలు అయ్యేది మీరేనని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    BJP Is Not Biryani That KCR Can Easily Eat | Big Wigs Warns CM | Oneindia Telugu
    భారతీయ ఝూటా పార్టీ బీజేపీ: మంత్రి హరీష్ రావు ఫైర్

    భారతీయ ఝూటా పార్టీ బీజేపీ: మంత్రి హరీష్ రావు ఫైర్


    బిజెపి అంటే భారతీయ ఝూటా పార్టీ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు . తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రమైన మధ్య ప్రదేశ్ జీడీపీ, తెలంగాణ రాష్ట్ర జీడీపీ కంటే తక్కువగా ఉందని, తలసరి ఆదాయంలో మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణలో సగం కూడా లేదని మంత్రి హరీష్ రావు లెక్కలు చెప్పారు. ఏ రకంగా చూసినా తెలంగాణాతో మధ్యప్రదేశ్ ను పోల్చలేమన్నారు. కేంద్రంలో 15 లక్షల 62వేల ఉద్యోగాలకు పై చిలుకు ఉద్యోగాలు ఉన్నాయని ముందు వాటిని భర్తీ చెయ్యాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం దివాలాకోరు మాటలు, విమర్శలు మానుకోవాలని బిజెపి నేతలకు హితవు పలికారు .అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులపై మండిపడ్డారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+