షాక్: 50 మంది డీఎంకే ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి జంప్ ! రాజేంద్ర బాలాజీ

చెన్నై: డీఎంకే పార్టీలో అసమ్మతి శాసన సభ్యులు చాలమందే ఉన్నారని, వారందరూ అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని, ఆరోజు త్వరలోనే వస్తుందని తమిళనాడు మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ బాంబు పేల్చారు.

ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి డోకాలేదని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే పార్టీ చేస్తున్న డిమాండ్ ను మంత్రి రాజేంద్ర బాలాజీ తొసిపుచ్చారు.

Minister K.T.Rajendra Balaji says that 50 DMK MLAS are ready to come AIADMK.

తమిళనాడు సచివాలయంలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే పట్టుబడితే అది వారినే దెబ్బ తీస్తుందని అన్నారు. డీఎంకే పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎడప్పాడి పళనిసామిని పదవి నుంచి దించెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలో భాగంగా రహస్య ఓటింగ్ నిర్వహిస్తే డీఎంకే పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు మాకే మద్దతుగా ఓటు వేస్తారని, అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏమి చేస్తారని మంత్రి రాజేంద్ర బాలాజీ డీఎంకే పార్టీ నాయకులను ప్రశ్నించారు.

మంత్రి రాజేంద్ర బాలాజీ మతిలేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మా పార్టీ శాసన సభ్యులు అందరూ మాతోనే కలిసి ఉన్నారని డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు. మొదట అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజేంద్ర బాలాజీకి చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+