కర్ణాటక జయనగర్ లో ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్ణాటక లోని 224 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో పోటీచేసిన నేతల భవిష్యత్తు నేడు ఈవీఎంలలో నిక్షిప్తం అవుతుంది.5.3 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును నేడు వినియోగించుకోనున్నారు.నేడు కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, 13 వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తుంది ఈసీ. మొత్తం ఈ ఎన్నికల్లో 2613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.కర్ణాటక ఎన్నికల పోలింగ్ లో కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మలా సీతారామన్ బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఇక్కడ ప్రజలు మూడ్ చాలా బాగుందని, ప్రజలు తన దగ్గరికి వచ్చి మాట్లాడిన తీరు వారు కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేస్తుందని అన్నారు.
ప్రజలకు ప్రధానమంత్రి తమ మాట వింటారని తెలుసునని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో ద్రవ్యోల్బణంపై మాట్లాడారు.. ఈ విషయంలో తాము ప్రజలతోనే ఉన్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
#WATCH | Union Finance Minister & BJP leader Nirmala Sitharaman arrives at a polling booth in Bengaluru to cast her vote.#KarnatakaElections pic.twitter.com/E8zdPRZCBT
— ANI (@ANI) May 10, 2023
ప్రజల పైన భారం పడకూడదని తాము అనుకుంటున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలకు దీనిపై మాట్లాడే హక్కు లేదని ను విమర్శించారు. వారు అధికారంలో ఉన్న సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాంటి వారికి తమ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే హక్కు ఉందా అని నిర్మల సీతారామన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications