వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్దప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు: రైల్వే భద్రతా ప్రమాణాలపై పీయూష్ గోయల్ ఫోకస్

వరుస ప్రమాద ఘటనల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా కూలంకషమైన చర్చ చేపట్టారు.

|
Google Oneindia TeluguNews

రైల్వే భద్రతా ప్రమాణాలపై రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశం

భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష

భద్రతా ప్రమాణాలకే అధిక ప్రాధాన్యమన్న కేంద్రమంత్రి

యుద్దప్రాతిపదికన ఐదు ప్రతిపాదనలతో కాపలా లేని క్రాసింగ్స్, పట్టాల చెకింగ్ కు ఆదేశాలు

కాపలా లేని రైల్వే క్రాసింగ్స్ ను త్వరితగతిన తీసియేవడం, గతంలో నిర్దేశించిన మూడేళ్ల కాలపరిమితి కంటే ఏడాది లోగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తీర్మానం

కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే భద్రతా ప్రమాణాలపై అధికారులతో చర్చించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో రైల్వే భద్రతా ప్రమాణాలపై ఒక సమగ్ర నివేదికను ప్రవేశపెట్టారు. వరుస ప్రమాద ఘటనల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా కూలంకషమైన చర్చ చేపట్టారు. భద్రతా ప్రమాణాలే తమకు అంతిమమని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

Minister of Railways Shri Piyush Goyal chairs a high-level meeting on Safety with Railway Board officials

రైల్వే ప్రమాదాలకు కారణమవుతున్న రెండు ప్రధాన కారణాలు:

a) 2016-17సంవత్సరంలో 34శాతం ప్రమాదాలు కాపలా లేని రైల్వే గేట్ల వల్లనే చోటు చేసుకున్నట్లు గుర్తించారు.

b) ట్రాక్స్‌లో లోపాల వల్ల పట్టాలు తప్పుతున్న ఘటనలు

రైల్వే ప్రమాదాల్లో పట్టాలు తప్పుతున్న ఘటనల వల్ల భారీ ప్రాణ నష్టాలు చోటు చేసుకుంటున్నందువల్ల దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రమాదాలను తగ్గించాలని భావిస్తున్నారు. సమావేశంలో దీని గురించే ప్రధానంగా చర్చించారు. రైల్వే భద్రతా ప్రమాణాలకు సంబంధించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.

1) ఇప్పటి నుంచి ఏడాది కాలపరిమితిలోగా దేశంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్స్ ను తొలగించేయడం. అంతకుముందు దీని కోసం మూడేళ్ల కాలపరిమితిని నిర్ణయించారు. కానీ 'స్పీడ్, స్కిల్ అండ్ స్కేల్' ప్రాతిపదికన సంవత్సరం లోగా దీన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

2) పట్టాల మరమ్మత్తులు, నాణ్యత లేని వాటి స్థానంలో కొత్త ట్రాక్స్ నిర్మించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

3)కొత్త రైళ్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవడం, నిర్ణీత వ్యవధిలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం

4)ఇప్పటిదాకా ఎక్కువ తయారుచేస్తూ వచ్చిన ఐసిఎఫ్ కోచ్ లను ఇకనుంచి నిలిపివేసి, వాటి స్థానంలో ఎల్.హెచ్.బి కోచ్ లను మాత్రమే తయారుచేయడం.

5)లోకో మోటివ్స్ లో యాంటీ ఫాగ్ ఎల్ఈడీలను అమర్చడం ద్వారా చలికాలంలో పొగమంచు అవరోధాలు, వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలను నివారించడం.

ఈ ఐదు అంశాలను రైల్వే అధికారులు యుద్దప్రాతిపదికన చేపట్టాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధికారులకు సూచించారు.

English summary
Minister of Railways and Coal, Shri Piyush Goyal today held a marathon meeting with members of full Railway Board & Safety Directorate of Railway Board to comprehensively review Safety measures for train operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X