మంత్రికి బైపాస్ సర్జరీ విజయవంతం, సుప్రీం కోర్టులో ఈడీకి షాక్, పార్టీ మారినా !

చెన్నై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తమిళనాడు డీఎంకే ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీకి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఇటీవల అరెస్టు అయిన తమిళనాడు మంత్రి బాలాజీకి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స చేసేందుకు అనుమతి కోరిన ఈడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం మంత్రిని కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పర్యవేక్షిస్తున్నట్లు చెన్నైలోని కావేరి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్‌ తర్వాత ఐసీయూలో ఆయన ఉన్నారని, మేము డాక్టర్లతో టచ్ లో ఉన్నామని డీఎంకే పార్టీకి చెందిన మరో సీనియర్ మంత్రి సుబ్రమణియన్ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.

Minister Senthil Balaji

మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. సీఎం ఎంకే స్టాలిన్ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ (47)ని ఈడీ అధికారులు గత బుధవారం ఉదయం 18 గంటల విచారణ తర్వాత అరెస్టు చేసింది.

ఆ సమయంలో మంత్రి సెంథిల్ బాలాజీకి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. అనంతరం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మంత్రి సహకారం లేకపోవడం, అరెస్ట్‌ మెమోపై సంతకం చేసేందుకు నిరాకరించడం, ఇడి అధికారుల విచారణకు సహకరించకపోవడం వలనే తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశామని ఈడీ అధికారులు కోర్టుకు చెప్పారు.

Minister Senthil Balajis

ఆ సమయంలో మంత్రి సెంథిల్ బాలాజీకి గుండెపోటు రావడంతో ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను చెన్నైలోని ప్రైవేట్ కావేరి ఆస్పత్రికి తరలించారు. కావేరి ఆసుపత్రిలోని వైద్య నిపుణులు మంత్రి సెంథిల్ బాలాజీకి వీలైనంత త్వరగా బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ చేయాలని సిఫార్సు చేశారు. తరువాత మంత్రి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ చేశారు.

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి గుండెపోటు డ్రామాలు ఆడుతున్నాడని, ఆయనకు ఢిల్లీలోయి ఎయిమ్స్ లో చికిత్స అందించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మంత్రి సెంథిల్ బాలాజీకి నిజంగానే గుండెపోటు వచ్చిందని, అరెస్టు చెయ్యాలనే ఈడీ అధికారుల మొండిపట్టుతో మానవత్వం లేకుండా ప్రవర్థిస్తున్నారని, వైద్యులు కూడా ఆయనకు బైపాస్ సర్జరీ చెయ్యాలని చెప్పారని మంత్రి న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు.

వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ విషయంలో మేము మధ్యలో జోక్యం చేసుకోలేమని, మీరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని ఈడీ అధికారులకు సూచించింది. సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఈడీ అధికారులు ఇప్పుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Minister Senthil Balajis

తరువాత సెంథిల్ బాలాజీ డీఎంకే పార్టీలో చేరి మరోసారి మంత్రి అయ్యారు. మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన మద్దతుదారులతో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎనిమిది రోజుల పాటు విస్తృత దాడులు నిర్వహించిన రెండు వారాల తర్వాత ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సెంథిల్ బాలాజీపై నమోదు అయిన కేసును 2022లో మద్రాస్ హైకోర్టు కొట్టి వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఈడీ అధికారులు సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+