వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వం దెబ్బకు ఫస్ట్ వికెట్ పడింది, అసెంబ్లీకి పరుగో పరుగు !

పన్నీర్ సెల్వంకు పిచ్చిపట్టింది, ఆయనకు సీఎం పదవి పోవడంతో మానసికంగా కుంగిపోయారు అంటూ ఇంత కాలం నానామాటలు మాట్లాడిన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యడానికి అసెంబ్లీక

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరి పదవి ఊడిపోతుందో తెలీక అయోమయానికి గురౌతున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి పదవులు తలకిందలు అయ్యే పరిస్థితి స్పష్టంగా కనపడుతున్న సమయంలో వారు ఆందోళనకు గురౌతున్నారు.

తమిళనాడు సీనియర్ మంత్రులు సైతం ఆందోళనకు గురికావడం గమనిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొందరు అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిదని వారికి కావలసిన పనులు చకచకా చేసుకుంటున్నారు.

ఊహించలేదు

ఊహించలేదు

శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తారని చిన్నమ్మ శశికళ వర్గీయులు కలలో కూడా ఊహించలేకపోయారు. చివరికి శశికళ నమ్మినబంటు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వమే ఆ ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించి పట్టపగలే చుక్కలు చూపించారు.

సార్ స్వరం మారింది

సార్ స్వరం మారింది

శశికళకు అత్యంత విశ్వాసపాత్రులుగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రులు సైతం ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు ఎలా చెబితే అలా నడుచుకుంటామని మాట మార్చేశారు.

ఐటీ దాడుల దెబ్బకు

ఐటీ దాడుల దెబ్బకు

ఐటీ దాడుతో పీకల్లోతు మునిగిపోయిన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ గురువారం ప్రత్యక్షం అయ్యారు. ఇంత జరిగినా ఇంకా శశికళ, టీటీవీ దినకరన్ ను నమ్ముకుంటే లాభం లేదని ఆయన గుర్తించినట్లు ఉన్నారు.

దిమ్మతిరిగిపోవడంతో

దిమ్మతిరిగిపోవడంతో

పన్నీర్ సెల్వంకు పిచ్చిపట్టింది, ఆయనకు సీఎం పదవిపోవడంతో మానసికంగా కుంగిపోయారు అంటూ మీడియా ముందు నానా మాటలు మాట్లాడిన ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు ఇప్పుడు సినిమా కనపడుతోంది. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఇక తనను దగ్గరకు తీసుకోదని విజయభాస్కర్ పసిగట్టారు.

అసెంబ్లీకి పరుగో పరుగు

అసెంబ్లీకి పరుగో పరుగు

గురువారం మద్యాహ్నం మంత్రి విజయభాస్కర్ తమిళనాడు సచివాలయం (అసెంబ్లీ) ముఖ్యకార్యదర్శి జమాలుద్దీన్ దగ్గరకు పరుగు తీశారు. జమాలుద్దీన్ క్యాబిన్ లోకి వెళ్లిన మంత్రి విజయభాస్కర్ ఆయనతో మంతనాలు జరిపారు.

మెడపట్టుకోక ముందే వచ్చేస్తే

మెడపట్టుకోక ముందే వచ్చేస్తే

మంత్రి వర్గం నుంచి మెడపట్టి బయటకు గెంటేయకముందే తన పదవికి రాజీనామా చెయ్యడం మంచిదని విజయభాస్కర్ తన సన్నిహితులతో చెప్పారని సమాచారం. అందుకే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించారని సమాచారం.

ఫస్ట్ వికెట్ పడిందా ?

ఫస్ట్ వికెట్ పడిందా ?

విశ్వసనీయ సమాచారం మేరకు తన పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించిన విజయభాస్కర్ శాసనసభ కార్యదర్శి జమాలుద్దీన్ ను కలిశారని తెలిసింది. జమాలుద్దీన్ కు ఆయన రాజీనామా లేఖ ఇవ్వడానికే వెళ్లారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

పన్నీర్ సెల్వం దెబ్బ అంటే ఇదే

పన్నీర్ సెల్వం దెబ్బ అంటే ఇదే

పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు కలిసిపోతున్నాయని వెలుగు చూడటంతోనే విజయభాస్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. అంతే కాకుండా దినకరన్ కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయభాస్కర్ మీద ఆదాయపన్ను శాఖ దాడులు చెయ్యడంతో ఆయనకు ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి.

English summary
Tamil Nadu Minister Vijayabaskar has met Assembly secretary Jamaludeen. Sources says that he may resign from his post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X