ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు, ప్రముఖుల అంజలి, జనం జేజేలు..
సోషలిస్ట్ లీడర్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం (మంగళవారం) సైఫైలో గల ఆయన స్వస్థలంలో ముగిశాయి. పూలతో అలంకరించిన ట్రక్ మీద నేతాజీ పార్థీవదేహం ఊరేగింపు చేశారు. ఆ ట్రక్ మీద కుమారుడు అఖిలేశ్ యాదవ్, ములాయం సోదరుడు శివపాల్ సింగ్ తదితరులు ఉన్నారు.
అనారోగ్యంతో గురుగ్రామ్ లో గల మేదాంత ఆస్పత్రిలో ములాయం సింగ్ యాదవ్ చేరిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అక్కడినుంచి ఆయన పార్థీవదేహం స్వగ్రామానికి తరలించారు. ప్రముఖులు నివాళి అర్పించారు. వేలాది మంది తరలిరావడంతో నేతాజీ అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. చివరిసారి చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు.

వాహనం వెంట నేతాజీ అమర్ రహే నినాదాలు మారుమోగాయి. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, స్థానికులు, యాదవుల అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, ఏపీ మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు, కేశవ్ ప్రసాద్ మౌర్య, జితిన్ ప్రసాద, సురేష్ ఖన్నా, ఆజం ఖాన్, బ్రజేష్ పాఠక్, అబు అజ్మీ, సంజయ్ నిషాద్, మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బాబా రామ్‌దేవ్, నటుడు అభిషేక్ బచ్చన్.. నేతాజీకి తుది వీడ్కోలు పలికారు.












Click it and Unblock the Notifications