భారత్ అదుపులో పీవోకే బాలుడు -చొరబాటా? పొరపాటా? -పాక్ పైశాచికానందం

కొత్త ఏడాది తొలిరోజే జమ్మూకాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద కలకలం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన ఒక బాలుడ్ని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సరిహద్దు దాటి పీవోకే నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించిన 14 ఏండ్ల బాలుడ్ని పూంచ్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గుర్తించింది.

సరిహద్దును ఆనుకుని ఉండే పూంఛ్ జిల్లాలోని అజోట్ గ్రామం సమీపంలోని బతర్ నల్లా వద్ద సంచరిస్తోన్న బాలుణ్ని మన బలగాలు పట్టుకున్నాయి. పీవోకేకు చెందిన బాలుడు తమ అదుపులో ఉన్నట్లు పూంచ్‌ ఎస్‌ఎస్‌పీ రమేష్ అంగ్రాల్ తెలిపారు. అతడు పొరపాటున సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని చెప్పారు. ఆ బాలుడి చొరబాటులో ఎలాంటి దురుద్దేశం లేనిపక్షంలో పాకిస్థాన్‌ అధికారులతో చర్చలు జరిపి అతడ్ని అప్పగిస్తామని వెల్లడించారు. కాగా,

 Minor boy from Pakistan-occupied-Kashmir held along LoC in Poonch

పది రోజుల కిందటే.. గుజరాత్ తీరంలోని భారత జలాల్లోకి ఓ పాకిస్తానీ పౌరుడు బోటులో ప్రవేశించగా, సమగ్ర వివరాలు సేకరించి, అనుమానం తీరాక మనవాళ్లు అతణ్ని వెనక్కి పంపారు. ఇటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) నుంచి సరిహద్దులు దాటి జమ్ముకశ్మీర్‌లోకి చిన్నారులు ప్రవేశించడం తరచుగా జరుగుతున్నది. గత నెలలో పీవోకేకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలు పొరపాటున భారత్‌వైపునకు రాగా.. సైనిక అధికారులు వారిని గుర్తించి, వివరాలు తెలిసిన తర్వాత బహుమతులు ఇచ్చి పీవోకేకు తిరిగి పంపారు. అయితే..

భారత్ సాధ్యమైనంతలో గెశ్చర్ పాటిస్తున్నప్పటికీ దాయాది పాకిస్తాన్ మాత్రం పైశాచికంగా వ్యవహరిస్తున్నది. గడిచిన 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2020 ఏడాదిలో ఏకంగా 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లుపొడిచింది. దాయాది సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు భారత ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+