డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: తాతను చంపిన తల్లి, కూతురు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధ విషయాన్ని భర్తకు చెబుతాననడంతో ఓ మహిళ తన మామను.. కూతురు, కొడుకుతోపాటు తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసు దర్యాప్తులో వెలుగుచూసిన వివరాలలిలా ఉన్నాయి. జైపూర్ లోని అంబర్ ఏరియాలో మధ్య వయస్కురాలైన ప్రియ అనే మహిళ తన కూతురు హర్ష (19) కొడుకు (14) తో కలిసి ఉంటోంది. కాగా, ఆమె భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె నివసించే ఇంటికి సమీపంలోనే ప్రియ మామ జవహర్ (భర్త తండ్రి) ఇల్లు ఉంది.
కొన్నేళ్లుగా భర్త దూరంగా ఉండటంతో ఒక రకమైన మానసిక ఆందోళనకు గురైన ప్రియ.. మామ జగదీశ్ తనకు చేతబడి చేయిస్తున్నాడని నమ్మేది. తిరుగుబడి చేయించుకునేందుకు కారు డ్రైవర్ నజీర్‌తో కలిసి ఓ మంత్రగాడి దగ్గరికి వెళ్లింది. అలా తిరుగుబడి పూర్తయ్యేలోపు నజీర్‌తో ఆమెకు చనువు పెరిగింది. అదే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

కాగా, కొంతకాలమైన తర్వాత ప్రియ కూతురు హర్ష కూడా నజీర్‌తో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. దీన్ని గమనించిన జవహర్.. వారిద్దరిపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాగే కొనసాగితే విషయం దుబాయ్‌లో ఉన్న తన కొడుకుకు చెబుతానని బెదిరించాడు. దీంతో తమ సంతోషానికి అడ్డొస్తున్నాడని భావించిన ప్రియ, ఆమె కూతురు హర్ష, డ్రైవర్ నజీర్‌తో కలిసి జవహర్ హత్యకు పథకం వేశారు.
గత ఆదివారం కోడలి ఇంటికొచ్చిన జవహర్‌ను ఆ ముగ్గురూ కలిసి తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని కవర్‌లో చుట్టి బయట పడేసే క్రమంలో ప్రియ కొడుకు కూడా వారికి సాయం చేశాడు. చుట్టచుట్టిన శవాన్ని కారులో తీసుకెళ్లి ఓ పాడుబడ్డ క్వార్టర్స్‌లో పడేశాడు డ్రైవర్ నజీర్.
సోమవారం ఉదయం కవర్‌లో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు ప్రియ, హర్షా, డ్రైవర్ నజీర్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు, 14 ఏళ్ల బాలుణ్ని జునైవల్ హోంలో ఉంచారు.












Click it and Unblock the Notifications