అవతారమని బాలికను ఇంటి ముందు పాతిపెట్టారు

 Minor buried in front of house, family claims it's a 'samadhi'
జైపూర్: డయేరియాతో మరణించిన పదేళ్ల బాలిక శవాన్ని కుటుంబ సభ్యులు గురువారంనాడు ఇంటి ముందే పాతిపెట్టారు. ఆమె దేవత అవతారమని, ఆమె సమాధిలోకి వెళ్లిందని చెబుతున్నారు. దీనిపై పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చోసుకున్నారు.

ఖుష్బూ అనే బాలిక డయేరియాతో బాధపడుతూ రాజస్థాన్‌లో భరత్‌పూర్ జిల్లాలో బుధవారం రాత్రి చనిపోయింది. గురువారంనాడు శవాన్ని కుటుంబ సభ్యులు ఇంటి ముందు పాతిపెట్టారు. ఆమె దేవత అవతారమని, ఆమె కోరిక మేరకు ఇంటి ముందు సమాధి చేశామని స్థానికులకు చెప్పారు.

అక్కడ ఓ టెంట్ వేసి, సమాధి స్థలం వద్ద పూజలు చేయడం ప్రారంభించారని భరత్‌పూర్ పోలీసు సూపరింటిండెంట్ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు నాట్ అనే సంచార జాతికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

టెంట్‌ను, ఇతర ఏర్పాట్లను అధికారులు తొలగించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అసహజమైన మరణంగా కేసు నమోదు చేసినట్లు రాహుల్ ప్రకాష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+