ఏడాదిగా మైనర్ బాలికపై 8 మంది టీచర్ల అత్యాచారం,వీడియో తీసి ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

rape

ఏడాది కాలంగా టీచర్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బాలిక తల్లిదండ్రులను బెదిరించారు.ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.

ఈ బాలిక ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ కు గురైంది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 13-year-old cancer patient from Bikaner's Nokha has alleged rape and blackmail by eight of her teachers at a private school in 2015. The accused allegedly forced the girl to stay back after school hours on the pretext of extra classes, made her take off her clothes and raped her. They even shot a video of their act which they used to blackmail the victim, alleged the girl's father.
Please Wait while comments are loading...