ఎత్తుకెళ్లి అమ్మాయిపై ఆరు రోజులు ఆరుగురు రేప్

వారణాసి/చందౌలి: ఆరుగురు వ్యక్తులు 17 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు శుక్రవారం ఆ విషయం చెప్పారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో గల ఇల్లియా పోలీసు స్టేషన్‌లోని తన పాఠశాలకు వెళ్తుండగా 12వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు.

పాఠశాలకు వెళ్తున్న అమ్మాయిని బలవతంగా తమ కారులోకి లాక్కున్నారు. కారులో ఆమెను అలహాబాద్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెను నిర్బంధించి దాదాపు ఆరు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసు సూపరింటిండెంట్ మునిరాజ్ చెప్పారు.

Rape

ఆ తర్వాత వారణాసికి తీసుకుని వచ్చి అమ్మాయిని కంట్ రైల్వే స్టేషన్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు. నిందితుల్లో ఒకతను అమ్మాయి తల్లిదండ్రులకు సోమవారంనాడు ఫోన్ చేశాడు. మీ అమ్మాయి రైల్వే స్టేషన్ వద్ద ఉందని చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు హుటాహుటిన రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. వారికి అక్కడ తమ కూతురు కనిపించింది.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అమ్మాయి గురువారంనాడు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తు కోసం అమ్మాయిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని మునిరాజ్ చెప్పారు. ఆరుగురు కూడా పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. యుపిలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అత్యాచార సంఘటనలు దేశంలో సామాజిక సమస్యగా తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+