తుపాకి గురిపెట్టి అమ్మాయిపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు సంబంధించి మరో దారుణం చోటు చేసుకుంది. చంపేస్తామని తుపాకితో బెదిరించి ఓ 14 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుత్సెరా గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు యువకులు బలవంతంగా చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న బాలికపై వారు అత్యాచారం చేసి, విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి పారిపోయారు.

సకీబ్, రకీబ్ అనే ఇద్దరు యువకులను నిందితులుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు శనివారంనాడు చెప్పారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications