షాక్ :మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
మైనర్ బాలికపై ఏడుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్ లో, ఈ ఏడాది జనవరిలో ఆ బాలికపై నిందితులు అత్యాచారం చేశారు. నిందితులను అరెస్టుచేశారు.
షిల్లాంగ్:పదకొండేళ్ళ బాలికపై ఏడుగురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ బాలికను బెదిరించి రెండు దఫాలు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మేఘాలయ రాష్ట్రంలలోని మత్థెన్ గ్రామానికి చెందిన పదకొండేళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో తొలిసారి సామూహిక అత్యాచారం చేశారు.బాధితురాలిని బెదిరించి ఆమెపై అత్యాచారం చేస్తున్నారునిందితులు.
ఈ ఏడాది జనవరి 13వ, తేదిన మరోసారి నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.బాదితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల వయస్సు 14 ఏళ్ళ నుండి 16 ఏళ్ళ వయస్సు ఉంటుందని చెప్పారు. నిందితులు నేరాన్ని ఒప్పుకొన్నట్టుపోలీసులు చెబుతున్నారు.నిందితులను పోలీసులు బాలల న్యాయస్థానంలో హజరుపర్చారు.












Click it and Unblock the Notifications