జేఎన్‌యూ క్యాంపస్‌లో కిడ్నాప్, గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ: బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్ యూ)లో ఓ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన యూనివర్శిటీ క్యాంపస్ లోని క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. ఈయన ఇంటిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఓ బాలిక పని చేస్తున్నది.

Minor girl kidnapped from JNU campus, gangraped in Delhi

సోమవారం రాత్రి గుర్తు తెలియని నిందితులు ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి బాలిక మీద గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాలికను తీసుకు వెళ్లి క్యాంపస్ ఆవరణంలో వదిలి పెట్టి పరారైనారు.

మొదట బాలికను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక కోలుకుంటున్నదని, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+