రాత్రి ఆలస్యంగా ఇంటికి!.. 'గ్యాంగ్ రేప్'పై బాలిక ట్విస్ట్.. పోలీసులు ఏం తేల్చారు?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బేగంపురకు చెందిన 16ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడైన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అసలు విషయాన్ని దాచిపెట్టిన బాలిక.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తల్లిదండ్రులకు చెప్పడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. బాలిక(16) తన 22ఏళ్ల వయసున్న తన స్నేహితుడితో కలిసి బుధవారం రాత్రి 9.30గం. పార్క్ కు వెళ్లింది. ఆ సమయంలో బాలికను బలవంతపెట్టిన యువకుడు.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆరోజు ఆలస్యంగా ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించారు.

 Minor girl raped by male friend lies, says she was gangraped

తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకు.. సూటిగా సమాధానం చెప్పకుండా.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ.. బాలిక ఓ కట్టు కథ అల్లింది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవి ఫుటేజీల్లో బాలిక స్నేహితుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

గ్యాంగ్ రేప్ అంటూ బాలిక చెప్పిందంతా కట్టు కథేనని నిర్దారించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సర కాలంగా అతను బాలికకు పరిచయం ఉన్నట్లుగా గుర్తించారు. బాలిక ఉండే ఇంటికి దగ్గరలోనే అతను ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక ఎందుకు అబద్దం చెప్పిందన్న విషయం కూడా తేలాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 16-year-old girl was allegedly raped by her friend at a park in Begumpur area of Rohini here, the police said on Wednesday.
Please Wait while comments are loading...