మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు, అతనిని ఏం చేశారంటే
మైనర్ విధ్యార్థిని ఉపాధ్యాయుడు గర్భవతిని చేసిన ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ముంబాయి: విధ్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే చెడు మార్గంలో పయనిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులది స్థానం అయితే గురువులు మాత్రం చెడుమార్గంలో పయనిస్తోన్న ఘటనలు ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. కన్న కూతురుగా చూడాల్సిన విధ్యార్థిని గర్భవతిని చేశాడో ఉపాధ్యాయుడు. ఈ విషయం బయటకు రావడంతో పారిపోయాడు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ముంబాయిలోని ఓ స్కూల్లో 42 ఏళ్ళ ఉపాధ్యాయుడు 13 ఏళ్ళ మైనర్ బాలికను పాఠశాలలోనే అత్యాచారం చేశాడు. రెండు సార్లు పాఠశాలలోనే విధ్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్, ఆగష్టు మాసాల్లో ఆ విధ్యార్థినిపై నిందితుడు అత్యాచారం జరిపాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.

తోటి విధ్యార్థినులు ఆడుకొనే సమయంలో మైనర్ విధ్యార్థిని తరగతి గదికి పిలిపించుకొని ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపేవాడు.అయితే కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆమె గర్భం దాల్చిన విషయం బయటపడింది.
వైద్యులు చెప్పిన మాటలు విని బాలిక తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉపాధ్యాయుడికి భార్య, కుమారుడు ఉన్నారు. నిందితుడిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుతో నిందితుడిని విధులనుండి తప్పించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications