• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Miss Universe 2021: విశ్వసుందరిగా భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్.. ఎవరీ బ్యూటీ..?

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కంది. ఈ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా..హర్నాజ్ సంధు వారందిరినీ అన్ని కేటగిరీల్లోనూ అధిగమించి యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. ఈ పోటీలో తన ప్రదర్శనతో భారతీయులను గర్వపడేలా చేసింది హర్నాజ్‌ కౌర్‌ సంధు.

21 ఏళ్ల తరువాత భారత్ కు దక్కిన కిరీటం


పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన బీట్రైస్ గోమెజ్ ఈ పోటీలో టాప్ 5లో నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది.హర్నాజ్ సంధు.. 2000 మార్చి 3న చంఢీగడ్​లో జన్మించింది. శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది.

17 ఏళ్ల వయసులో మోడలింగ్ తో


హర్నాజ్‌ చిన్నప్పటి నుంచి ఫిట్‌నెస్‌ లవర్‌. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌‌ను అమితంగా ఇష్టపడుతుంది.ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 21ఏళ్ల అమ్మడు.17ఏళ్ల వయసులో మోడలింగ్​ ప్రారంభించిన హర్నాజ్​ ఇప్పటివరకు 2017లో టైమ్స్​ ఫ్రెష్​ ఫేస్​ మిస్​ చండీగఢ్​, 2018లో మిస్​ మ్యాక్స్​ ఎమర్జింగ్​ స్టార్​, 2019లో ఫెమినా మిస్​ ఇండియా పంజాబ్​, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని అందుకుంది. చిన్నతనంలో సన్నగా గాలొస్తే ఎగిరిపోయెలా ఉండడంతో.. తోటివారు చేసే హేళనకు భరించింది.

మిస్ యూనివర్స్ సాధించిన మూడో యువతిగా

సిగ్గుతో తలదించుకుని ఒంటిగా గడపడానికి అలవాటైన హర్నాజ్‌ కు కుటుంబం మద్దతుగా నిలిచింది. తర్వాత మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మరోవైపు సినిమాల్లో నటిస్తూనే అందాల పోటీల్లో పాల్గొని.. ఇప్పుడు ఏకంగా భారత్ కు మూడో మిస్ యూనివర్స్‌ కిరీటాన్నీ అందించింది. స్వతహాగా నటి అయిన ఈమె.. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని సుస్మితాసేన్‌ (1994), లారాదత్తాల (2000) మాత్రమే సాధించారు.

Recommended Video

  Teamindia Players Who Can Miss Sa vs Ind Series || Oneindia Telugu
  భారతీయలు గర్వపడేలా..

  భారతీయలు గర్వపడేలా..

  ఈ పోటీలో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్ సంధు పోటీపడింది. చివరకు ఆధిక్యాన్ని సంపాదించి ఈ ఏడాది మిస్ యూనివర్స్ గా నిలిచింది. ఈ పోటీలో తన ప్రదర్శనతో భారతీయులను గర్వపడేలా చేసింది. వారిపై నెగ్గిన హర్నాజ్‌కు మెక్సికోకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ధరింపజేసింది. దీంతో..ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హర్నాజ్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది.

  English summary
  Its a good news for India in the beauty field, Harnaaz Sandhu of India is crowned as Miss Universe 2021.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X